ఐపీఎల్ 2022తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్‌లో కూడా అదరగొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేరింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రాజస్థాన్‌ను క్వాలిఫైయర్ 1లో మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ సక్సెస్ గురించి ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడానికి గల ప్రధాన కారణం తమ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అని పేర్కొన్నాడు. టీమ్ సక్సెస్ క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుందని పేర్కొన్నాడు.
తనలోని అత్యుత్తమ ఆట తీరును బయటికి తీశాడని, ఈ సీజన్‌లో తాను రాణించడం వెనుక నెహ్రా పాత్ర కీలకమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే నా సోదరుడు కృనాల్ పాండ్యాతో మాట్లాడుతూ నా అత్యుత్తమ ఆటను వెలికితేసే సత్తా ఆశిష్ నెహ్రాకే ఉందని చెప్పా. ఆయనతో కలిసి ఆడటంతో పాటు, ఎక్కువసేపు గడుపుతుంటాను. అతని కంపెనీని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. క్రికెట్ గురించి మా ఇద్దరీ ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులలో నెహ్రా ఒకడు. ప్రతీ ఒక్కరికి కావాల్సినంత టైమ్ ఇస్తాడు. గుజరాత్ సక్సెస్ క్రెడిట్ నెహ్రాతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు ఇవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని వీళ్లు ప్రశాంతంగా ఉంచేవారు.నా కెప్టెన్సీ విషయానికి వస్తే.. జట్టులోని ఆటగాళ్లకు ఎవరీ బాధ్యతలపై వారికి క్లారిటీ ఉంది. జట్టు విజయం కోసం వారు చేయాల్సిందల్లా చేస్తున్నారు. దాంతో కెప్టెన్‌గా నా పని సులువవుతోంది. అయితే ఆటగాళ్లుగా మాపై మాకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అందరం ఇంట్లో ఉన్నామనే ఫీలింగ్‌తో ఉన్నప్పుడే జట్టుగా రాణించగలం. మనం ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే.. మన పోరాటం మనం చేయాలి. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నించాలి. టీమ్ కోసం ఎంత ఎఫెర్ట్ పెట్టారనే విషయాన్నే నేను లెక్కలోకి తీసుకుంటా. నా జీవితంలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు.
మెగా వేలానికి ముందు నన్ను తీసుకోరని, రిటైన్ చేసుకోరని చాలా విమర్శలు చేశారు. అయితే వాటికి సమాధానం చెప్పడానికి ఇది సరైన మార్గం కాదనేది నా అభిప్రాయం. నా గురించి తప్పుగా మాట్లాడి, విమర్శలు చేసిన వారిని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని నేను కోరను. ఎందుకంటే ఇప్పటికే వారంతట వారే నాపై చేసి వ్యాఖ్యలకు పశ్చాతాపపడుతున్నారని భావిస్తున్నా’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యాను జట్టును అద్భుతంగా నడిపించాడు. పైగా తన వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుంది. అలాగే ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాలో తిరగి చోటు సంపాదించాడు. మరి హార్థిక్ పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: ఈసారికి వదిలేయండి.. 2023లో మేమేంటో చూపిస్తాం: రోహిత్ శర్మ
#IPL2022 Final #GTvsRR: #HardikPandya reveals chat with brother #KrunalPandya before signing up for Gujarat Titans @hardikpandya7 @krunalpandya24 https://t.co/onMD4Ti94h
— Zee News English (@ZeeNewsEnglish) May 29, 2022