ఐపీఎల్ 2022 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుందని భావిస్తే.. సప్పగా సాగిందని క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. గుజరాత్ టైటాన్స్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు రాజస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించాడు. కానీ.. హెట్‌మేయిర్ వికెట్ తీసి ఆ సంతోషాన్ని అంపైర్‌తో కలిసి పంచుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన హార్థిక్ పాండ్యా చివరి బంతికి డేంజరస్ బ్యాటర్ హెట్‌మేయర్‌ను కాట్ అండ్ బౌల్డ్‌గా అవుట్ చేశాడు. క్యాచ్ అందుకుని వేగంగా లెగ్ అంపైర్ దగ్గరికి పరిగెత్తి అతనితో కలిసి వికెట్ పడగొట్టిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. పైగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోకుండా.. బ్యాటింగ్ తీసుకోవడం, వెంటవెంటనే వికెట్లు పడిపోవడం.. చివరికి మ్యాచ్‌ను చాలా తేలిగ్గా గుజరాత్‌కు సమర్పించడంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయిన విషయం పాండ్యాకు ముందు తెలుసని.. అందుకే ఇలా అంపైర్‌తో కూడా సెలబ్రేట్ చేసుకున్నాడంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
గుజరాత్ బౌలర్లలో హార్థిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్థిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా వికెట్ తీసి అంపైర్‌తో సెలబ్రేట్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: నాలో ఉన్న బెస్ట్‌ను అతనే బయటికి తీశాడు: హార్థిక్ పాండ్యా
IPL 2022 final: Hardik Pandya dismisses Shimron Hetmyer, wicket celebration disposition umpire#GTvRR #GujaratTitans #HardikPandya #IPLFinalshttps://t.co/EX51AifFaE
— Business Upturn (@businessupturn) May 29, 2022
— Sayyad Nag Pasha (@PashaNag) May 30, 2022