ఐపీఎల్ 2022 సీజన్ లో మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గాడి తప్పినట్లుగా కనిపిస్తోంది. వరుస విజయాల నుంచి వరుస పరాజయాల్లోకి వెళ్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో మ్యాచ్ ఓటమి పాలైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్ ఛేదనలో విఫలమైంది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో పూరన్, మార్కర్రమ్ పోరాటం వృథా అయ్యింది. భీష్ముడి మరణానికి సవా లక్ష కారణాలు అన్నట్లు.. హైదరాబాద్ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. కానీ, ప్రధానంగా డేవిడ్ వార్నర్ పేరు చెప్పుకోవచ్చు. తనని కాదని అవమానించిన హైదరాబాద్ జట్టుపై వార్నర్ చెలరేగి ఆడాడు. ఒక విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడనే చెప్పాలి.
ఇదీ చదవండి: కేన్ మామ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే SRH గెలిచేది!
డేవిడ్ వార్నర్.. ఈ పేరు హైదరాబాద్ ఫ్రాంచైజీకి గత కొద్ది రోజులుగా మింగుడు పడటం లేదు. గత సీజన్లో వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ తర్వాత డగౌట్ లో స్థానం కల్పించకుండా అవమానించడం చూశాం. రిటైన్ చేసుకోకపోగా.. వేలంలోనూ అతడిని వద్దని వదిలేసింది. అన్నింటికీ కలిపి వార్నర్ గురువారం బ్రబౌన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకున్నాడు. 58 బంతుల్లో 3 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెంచరీ మిస్ అయినా కూడా హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ అభిమానులంతా హైదరాబాద్ జట్టుకు గట్టి మెసేజ్ పంపాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Hence proved, David Warner 𝐅𝐈𝐑𝐄 hai 🔥#YehHaiNayiDilli | #IPL2022 | #DCvSRH | @davidwarner31 | #TATAIPL | #IPL | #DelhiCapitals | #Pushpa pic.twitter.com/0njDVwJqVZ
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2022
అంతే కాదు.. హైదరాబాద్ మీద మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సెంచరీ మిస్ అయినా కూడా.. అర్ధ శతకం విషయంలో క్రిస్ గేల్ రికార్డును వార్నర్ అధిగమించాడు. క్రికెట్ చరిత్రలో టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన తొలి బ్యాటర్ గా వార్నర్ అవతరించాడు. 88 అర్ధ శతకాలతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక హాస్ సెంచరీస్ రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్ టీమ్ పై చేసిన అర్ధ శతకంతో తన కెరీర్ లో 89వ అర్ధ శతకం నమోదు చేసి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అటు మ్యాచ్ ఓటమికి కారణం కావడమే కాకుండా… కెరీర్లో గుర్తుండిపోయే రికార్డును హైదరాబాద్ తో మ్యాచ్ లో నెలకొల్పడం గమనార్హం. డేవిడ్ వార్నర్ హైదరాబాద్ టీమ్ పై పగ తీర్చుకున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Things you love to see 💙🤳🏻#YehHaiNayiDilli | #IPL2022 | #DCvSRH#TATAIPL | #IPL | #DelhiCapitals | @davidwarner31 pic.twitter.com/RZBculUU1r
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2022