ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. 166పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వివాదాస్పదరీతిలో అవుటయ్యాడు. ఈ అవుట్ పట్ల నెట్టింటా డిబేట్లు మొదలయ్యాయి. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం ప్రకటించాడు అంటూ సోషల్ మీడియా దుమ్మేత్తిపోస్తోంది.
టీమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిందో తాకలేదో కానీ ప్యాడ్‌కు తాకి కీపర్ షెల్డన్ జాక్సన్ వైపు వెళ్లగా..అతను అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అవుట్ అంటూ జాక్సన్ అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో జాక్సన్ రివ్యూ తీసుకోవాలంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్‌కు సూచించగా.. అతను రివ్యూకు వెళ్లాడు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్ పరిశీలిస్తుండగా.. బాల్, బ్యాట్ మధ్య గ్యాప్ ఉండగానే అల్రా‍్ట ఎడ్జ్‌లో స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ అవుటని ప్రకటించాడు.ఈ నిర్ణయంతో ఒక్కసారి తెల్లమొహం వేసిన రోహిత్ పూర్తి అసహనం వ్యక్తం చేశాడు. బంతి క్లియర్‌గా బ్యాట్‌కు రీచ్ అవుతున్నప్పుడే స్పైక్స్ వచ్చాయి. ఇది వైడ్ యాంగిల్స్‌లో చూసినప్పుడు బ్యాట్‌కు బంతి దూరంగా కన్పించింది. అలాగే జాక్సన్ కూడా సరిగా క్యాచ్ అందుకున్నాడో లేదో అన్న విషయంలోనూ డౌట్స్ ఉన్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌లో ఫేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. ఈసారి థర్ఢ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై 9వ ఓటమిని మూటగట్టుకుంది. మరి రోహిత్ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravi Shastri: స్పీడ్ వేయడం గొప్ప కాదు.. ఉమ్రాన్ మాలిక్‌పై రవిశాస్త్రి సెటైర్లు
Clear technical glitch…ball hasn’t even reached the bat and look at the spike go…
How in the world was that overturned?#MIvKKR #IPL2022 pic.twitter.com/tABqwgd7oT
— Rohit Sankar (@imRohit_SN) May 9, 2022
Was #MI captain #rohitsharma out or not out in #IPL2022 game vs #KKR
Fans roast umpire for taking decision in a hurry, check reactions below:#MIvKKR https://t.co/pOztc8cIJV
— Zee News English (@ZeeNewsEnglish) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.