ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌కి చేరిన విషయం తెలిసిందే. మే 25న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఢీ కొట్టనుంది. ఎవ్వరు ఊహించని విధంగా ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంతో.. అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మిస్టర్ 360.. ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2023 ఆడుతానని స్పష్టం చేశాడు. ఇటీవలే ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి ఇందుకు సంబంధించి హింట్ ఇవ్వగా.. తాజాగా ఏబీడీ దానిని కన్ఫర్మ్ చేశాడు.
ఎవరూ ఊహించని విధంగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. 2021 సీజన్ తర్వాత ఐపీఎల్‌కి కూడా దూరమయ్యాడు. నిజానికి ఆటపై ఉన్న ఇష్టంతో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూసినా.. దక్షిణాఫ్రికా బోర్డు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏబీ.. అంతర్జాతీయ రీఎంట్రీపై ఆశలు వదులుకున్నాడు. ఇక ఐపీఎల్‌కి సైతం గతేడాది గుడ్ బై చెప్పినా.. ఏబీ, మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల విరాట్ కోహ్లీ సైతం.. ఏబీ రీఎంట్రీపై హింట్ ఇచ్చాడు. డివిలియర్స్‌ను మిస్సవుతున్నా అని,ఆర్‌సీబీలోకి వచ్చే సీజన్ లో అతను వస్తాడనుకుంటా అంటూ హింట్ ఇచ్చాడు. చివరకు కోహ్లీ మాటలే నిజం అయ్యాయి. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీ.. ఐపీఎల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2023కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
“I will be around #RCB next year, I am missing it, don’t know in which capacity but I would like to visit my second home which is Chinnaswamy stadium” – #ABdeVilliers pic.twitter.com/kX81mXv8MQ
— Thyview (@Thyview) May 24, 2022
‘ఐపీఎల్ టోర్నీలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా. ఐపీఎల్ 2023కి అందుబాటులో ఉంటా. బెంగళూరు నాకు రెండో ఇల్లు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటం చాలా ఇష్టం‘ అని మిస్టర్ 360 చెప్పాడు. అయితే ఏబీ.. ప్లేయర్‌గా వస్తాడా లేదా మెంటార్‌గా వస్తాడా లేదా కోచ్‌గా వస్తాడన్న విషయం తెలియరాలేదు. ఇక.. ఈ సీజన్ లో నైనా.. ఆర్సీబీ టైటిల్ కొట్టాలని అందరూ సూచిస్తున్నారు. 14 సీజన్లుగా కలగా మిగిలిపోతున్న ఐపీఎల్ టైటిల్ కోరిక నెరవేర్చుకునేందుకు ఇదే మంచి సమయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కోరిక నెరవేరుతుందో.. లేదో.. చూడాలి.
On this day in 2018, one of the greats of the game AB de Villiers announced his international retirement.
He tweeted this before his final series in intl cricket and made the cricket world remember his last series forever💔 pic.twitter.com/kkhjwtmZmj
— CricTracker (@Cricketracker) May 23, 2022
After 70 days in Mumbai, the team travelled to Kolkata for the #IPL2022 playoffs, and we bring to you some glimpses of what happened during the journey, on @kreditbee presents Bold Diaries.#PlayBold #WeAreChallengers #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/ruKzy79Zg6
— Royal Challengers Bangalore (@RCBTweets) May 24, 2022
ఇది కూడా చదవండి: ముంబై గెలవగానే RCB ప్లేయర్లు చూడండి ఏం చేశారో.. వీడియో వైరల్