ఈ పనులు చేస్తే మీపై నరదిష్టి పని చేయదు!

నరదిష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిలిగిపోతుంది అనే మాట వినే ఉంటాము. ఆ మాట ముమ్మాటికీ నిజమే . ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు ఆర్ధిక సమస్యలు కూడా మొదలవుతాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ.. మన ఇళ్లలో దిష్టి తీయడం మనం చూసే ఉంటాము. పాడు కళ్లు, పాపిష్టి కళ్ళు అన్న మాటలు వినే ఉంటాము. అవును నరదిష్టి అంత డేంజర్. కాబట్టి.. ఆర్ధికంగా ఎదుగుతున్న మనిషి నరదిష్ఠికి లోనుకాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయక .. నరుల దృష్టిలో పడి నర దిష్టి తగిలిందో.. ఈ నరదిష్టి కొంత కాలానికి నరఘోషగా పెరిగి.. నర శాపంగా మారుతుంది. ఆ తరువాత నరపీడ అవుతుంది. పరిస్థితి ఇంత వరకు వస్తే కనుక ఎంతటి వారైనా సరే.. ఆరోగ్య పరంగా, ఆర్ధికంగా.. పాతాళానికి పడిపోతారు. జీవితంలో కోలుకోలేని స్థితికి దిగజారిపోతారు. మరి ఈ నరదిష్ఠి… నర పీడ వరకు చేరకముందే.. దీని నుండి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఎదుటి వారి కంటి నుండి వచ్చే నకారాత్మక శక్తి వల్ల మన నాశనం మొదలవుతుంది. దీని నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ప్రధానమైనది కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం. ఆడవారైన, మగవారైనా దేవుడి సన్నిధిలోని కుంకమని తీసి బొట్టుగా పెట్టుకుంటే.. నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు.

2) అలాగే ఏ గృహిణి అయితే నిత్యం ఇంట్లో దీపారాధన చేసి కుల దైవాన్ని పూజిస్తుందో, కుల దేవతా యంత్రానికి ఎరుపు రంగు పుష్పాన్ని, బెల్లాన్ని భక్తితో సమర్పిస్తుందో ఆ గృహిణి ఉండే ఇంటికి నరదిష్టి కాని నర పీడ కాని ఏది పని చేయదు.

3) లక్ష్మీ నరసింహ స్వామికి నిష్ఠతో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేసి.., నల్లటి మిరియాల పొడిని ఆయన ముందు నైవేద్యంగా ఉంచుతారో వారికి ఎట్టి నరపీడ కలగదు.

4) మగవారైతే మొలకి ఎరుపు రంగు దారాన్నిమొలతాడుగా కట్టుకోవడం వల్ల, చిన్న పిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు.

disti 25) ఇక నరదిష్టి, నరపీడ నుండి తప్పించుకోవడానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గం ఇంటి గృహిణి ఎడమ కాలికి నలుపు రంగు దారాన్ని కట్టడం. ఇలా చేస్తే ఆ ఇంటి సభ్యులు పై కూడా నరదిష్ఠి ప్రభావం ఉండదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికి భార్యే మహాలక్ష్మి ప్రతిరూపం . ఆమె పై ఎలాంటి చెడు ప్రభావం లేకుంటే.. ఆ గృహంలోకి కూడా ఎలాంటి నెగిటీవ్ ఎనర్జీ ప్రవేశించలేదు.

6) అలాగే పెళ్లి కాని స్త్రీలు.. నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నర దిష్టి నుండి తప్పించుకోవచ్చు.

7) ఇక వివాహమైన స్త్రీలో ప్రతిరోజు కాలికి పసుపు రాసుకోవడం వల్ల.. పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల.. ఆమె సంతానం పై ఎలాంటి నర దిష్టి పని చేయదు.

8) ఇక మగవారైతే కుడిచేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల, అలాగే మెడలో నరసింహస్వామి డాలర్ కట్టుకోవడం వల్ల ఎంతటి నర గోష్ఠ నుండి అయినా తప్పించుకోవచ్చు.

9) ఇక ఇంటి ముందు గుమ్మడికాయని వేలాడతీయడం, రాక్షస రూపాలని పెట్టుకోవడం, కళ్ళ దిష్టి వినాయకుని ఫోటోలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

10) ఇక ఏ ఇంటిలో అయితే తులసి మొక్కకి నిత్యం పూజ జరుగుతుంటుందో ఆ ఇంటి లోపలకి ఎలాటి నెగిటీవ్ ఎనర్జీ ప్రవేశించలేదు. కాబట్టి నిత్య తులసి పూజ ద్వారా కూడా మనం నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు.

సో చూశారు కదండీ.. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే .. నరదిష్టి నుండి.., నరపీడ నుండి.. బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను.. తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.