పోలీసుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మహిళా పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తే దెబ్బలు తినాల్సి ఉంటుంది. పొద్దున్నే ఎవరి మొఖం చూశాడో గానీ పాపం ఓ యువకుడు మహిళా పోలీసు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ యువకుడి మొబైల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ యువకుడు దురుసుగా ప్రవర్తించసాగాడు. “మీడియాని పిలుస్తా అవసరమైతే” అంటూ హడావుడి చేయసాగాడు. ఫోన్ ఇవ్వడం లేదని ఆ యువకుడి చేతిలోంచి ఫోన్ లాకున్నారు ఆ మహిళా కానిస్టేబుల్. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. మహిళా కానిస్టేబుల్ చేతిలోంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. “ఫోన్ లాక్కున్నావ్, పద్దతి కాదు” అంటూ ఆమెకి తప్పు ఒప్పు చెప్పసాగాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. నాలుగు దెబ్బలు కొట్టి స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఒకవేళ యువకుడు తప్పు చేసినప్పటికీ పోలీసులు అలా చేయి చేసుకోవడం తప్పని కొందరు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే అలానే నాలుగు తన్నాలని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మియు అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ పరిచయంతో ప్రేమ పెళ్లి.. అంతలోనే ఇంత దారుణమా? ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 6 ఏళ్లు తిరిగేసరికి!