Crime News: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన విషయాలు చాలానే భయపడ్డాయి. పశ్చిమ బెంగాల్లో ఓ మంత్రి కూడా అవినీతికి పాల్పడి బుక్కయ్యాడు. ఓ సినీ నటి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు దాచాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. నటి ఇంట్లో దొరికిన కట్టల డబ్బు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీగా డబ్బు బయటపడింది. శనివారం విజిలెన్స్ అధికారులు బిహార్‌కు చెందిన ఆర్‌డబ్ల్యూడి ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సంజయ్ లంచం బాగా తీసుకుంటున్నాడన్న పక్కా సమాచారంతో అధికారులు ఆయన ఇంటిపైకి వెళ్లారు. ఇంట్లో జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల డబ్బు బయటపడింది. ఆ డబ్బు మొత్తం కోటి రూపాయలకు పైగా ఉందని అధికారులు చెప్పారు. డబ్బుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. నాలుగు చోట్ల జరిపిన సోదాల్లో మొత్తం 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక, ఇంట్లో దొరికిన డబ్బులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో కుప్పలుగా పోసిన ఆ డబ్బును అధికారులు లెక్కిస్తూ ఉన్నారు. అంత పెద్ద మొత్తం లెక్కించటం వల్ల కాక, కౌంటింగ్ మిషిన్‌ను రంగంలోకి దింపారు. మరి, ప్రభుత్వ అధికారి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొరకటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. #WATCH | Bihar: Cash counting is underway at the residence of Sanjay Kumar Rai, Executive Engineer of the Kishanganj Division of Rural Works Department in Patna. Vigilance department has conducted raids at 3-4 premises of Sanjay Kumar Rai in Bihar pic.twitter.com/RwW04tNs4I — ANI (@ANI) August 27, 2022 ఇవి కూడా చదవండి : పెళ్లీడుకొచ్చిన కొడుకు ముందే ప్రియుడితో రెచ్చిపోయిన మహిళ.. ఈ దారుణం చూడలేని కొడుకు!