సెంచురీ లు కొట్టే ”స్టేట్స్” – పెరుగుతోన్న పెట్రో రేట్స్!..

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. అయితే ఈ మధ్య వరసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విక్రయ సంస్థలు వరసగా పెంచుతూనే పోతున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. ఈ నెలలో ధరల పెరగడం ఇది నాలుగోసారి. సోమవారం లీటరు పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు రూ.95.37, డీజిల్ రూ. 86.28కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ రూ.101.52, డీజిల్ రూ. 93.58గా ఉంది. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటడం గమనార్హం. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, మధ్యప్రదేశ్‌లోని అనూన్‌నగర్‌లో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో నమోదైంది.

petrol diesel karnataka660 051418061027

శ్రీగంగానగర్‌లో లీటరు పెట్రోలు రూ.106.39, డీజిల్ రు. 99.24, అనూప్‌నగర్‌లో పెట్రోల్ రూ.106.24, డీజిల్ రూ. 97.37, పర్భనిలో పెట్రోల్ రూ.103.88, డీజిల్ రూ. 94.42, భోపాల్‌లో పెట్రోల్ రూ.103.52, డీజిల్ రూ. 94.84, జైపూర్‌లో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ. 95.16గా ఉంది. ఓవైపు కరోనా ప్రభావంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పెట్రో ధరలకు పగ్గాల్లేకుండా పోతుండటంపై ప్రతీ ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్‌, జోగులాంబ గద్వాల్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. అనేక జిల్లాల్లో సెంచురీ కొట్టడానికి అతి చేరువలో ఉంది. ఏపీలో కడప, విశాఖపట్నం తప్ప దాదాపు అన్ని జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటడం గమనార్హం. అత్యధికంగా తూర్పు గోదావరిలో రూ.101.23గా నమోదైంది.