పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు ఆదాయ పన్ను శాఖా పలు రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతోంది. అందుకోసం తాజాగా ఆదాయపు పన్ను శాఖలో పలు మార్పులు కూడా చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో నిర్ధేశించిన పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రాల విషయంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్ తెరవడానికి ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ రెండింటికి ఆధార్ లేదా పాన్‌ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం బ్యాంకు లేదా తపాలాఫీసులో నగదు డిపాజిట్ చేస్తే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టం (15వ సవరణ) నిబంధనలు-2022 కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఖరారు చేసింది. 2022 మే 26వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయి. నగదు లావాదేవీల వాడకాన్ని తగ్గించేందుకు, డిజిటల్ విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీడీటీ ద్వారా ఈ నిబంధనలను తీసుకొచ్చింది. అనుమానాస్పద డిపాజిట్లు, విత్ డ్రాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లను అడ్డుకునేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు..
ఇది కూడా చదవండి: Successful Story: రైతుగా మారిన.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కథ! ఈమె దేశానికే స్ఫూర్తి!