Successful Story: రైతుగా మారిన.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కథ! ఈమె దేశానికే స్ఫూర్తి!

Mudita Akoijams business model inspiration story

Successful Story: దశాబ్దాల క్రితమే మనిషి తాను తినే తిండిపై అవగాహన కోల్పోయాడు. పైపై మెరుగుల కోసం తినే తిండిని కూడా పాడు చేస్తున్నాడు. ఎందుకూ పనికిరాని పిప్పిని తింటున్నాడు. ముఖ్యంగా తినే అన్నం విషయంలో.. సాధారణంగా వడ్లు దంచిన తర్వాత వచ్చే దంపుడు బియ్య ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, ఆ బియ్యం చూడ్డానికి అందంగా, తెల్లగా కనపడాలన్న వెర్రి ఆలోచనలతో జనం వాటిని పాలిష్‌ పట్టిస్నున్నారు. పై పొరలో ఉండే బలవర్థకమైన పోషకాలను పక్కకు పడేస్తున్నారు. వ్యర్థంలాంటి పిప్పిని తింటున్నారు. లేనిపోని అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయమే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదితను కలిచివేసింది. పూర్వీకులను 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉంచిన రసాయనాలు లేని తిండి పదార్ధాలను అందరికీ అందించాలని అనుకుంది. మణిపుర్‌లో మాత్రమే పండిస్తున్న బ్లాక్‌ రైస్‌, గోస్ట్‌ చిల్లీ వంటి వాటిని దేశానికి మొత్తం పరిచయం చేసింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి రైతుగా మారింది. 500లకు పైగా మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకు విస్తరిస్తోంది.

జనం కష్టాలకు చలించి.. లక్షలు వచ్చే ఉద్యోగం వదిలి..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిత అకోయ్‌జామ్‌ సింగ్‌ కలలో కూడా తాను పొలంలోకి దిగుతానని అనుకోలేదు. 2010లో ఢిల్లీలోని జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2011లో మాస్టర్స్‌ డిగ్రీ కోసం లండన్‌ వెళ్లింది. 2012లో ఇండియాకు తిరిగి వచ్చింది. ఓ కార్పోరేట్‌ కంపెనీలో డిప్యూటీ ఫినాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. రోజులు గడుస్తున్నాయి. బంధువులు, తెలిసిన వాళ్లు ఇలా ఎవరో ఒకరు చిన్న వయసులోనే డయాబెటీస్‌, గుండె జబ్బులతో బాధపడటం ఆమెను కలిచివేసింది. అల్లోపతి మందుల కారణంగా వారి సమస్యలకు పరిష్కారం దొరకటం లేదని గుర్తించింది. బామ్మల కాలానికి ప్రస్తుత తరానికి మధ్య ఉన్న తేడా ఆమెకు స్పష్టంగా అర్థమైంది.

Mudita Akoijams business model inspiration story

చిన్నపుడు మణిపుర్‌లోని తాతగారింటికి తరుచూ వెళ్లేది. వాళ్లు ఎంతో సాధారణంగా బతికే వారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన వాటినే వాళ్లు తినేవారు. అలాంటి ఆహారంతోనే ముదిత బామ్మ 100ఏళ్లు బతికింది. దీంతో ఆమెలో ఆలోచన మొదలైంది. మణిపుర్‌లో దొరుకుతున్న ఆహారంలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోసాగింది. శాస్త్రవేత్తలను సైతం కలిసింది. బ్లాక్‌ రైస్‌, గోస్ట్‌ చిల్లీ గురించి తెలుసుకుంది. దేశంలో మణిపుర్‌లోని తౌబాల్‌లో మాత్రమే పండిస్తున్న వీటిని అందరికీ అందించాలని అనుకుంది. 2015లో ఉద్యోగం వదిలి పొలంలోకి అడుగుపెట్టింది. తండ్రి ఆమెకు ఎంతో అండగా నిలిచాడు.

ప్రతీ అడుగు ఆచీతూచీ వేస్తూ.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ..

జాబ్‌ వదిలేసిన తర్వాత మణిపుర్‌తో పాటు చాలా ప్రదేశాలకు ప్రయాణించింది. తను అడుగుపెట్టిన మార్కెట్‌ గురించి తెలుసుకోవటానికి రైతులు, ఎన్జీఓలతో మాట్లాడింది. ఆరునెలల కాలాన్ని మార్కెట్‌ను అర్థం చేసుకోవటాని వెచ్చించింది. బ్లాక్‌ రైస్‌, ఉమోరాక్‌ చిల్లీలను పండించే మహిళా రైతులనుంచి చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసి అమ్మటం మొదలుపెట్టింది. తన వస్తువులకు డిమాండ్‌ ఎంత ఉందో తెలుసుకోవటానికి రెస్టారెంట్లకు ఫోన్‌ చేసి సర్వేలు నిర్వహించింది. వాళ్లు ఆసక్తిచూపటంతో తన వ్యాపారాన్ని విస్తరించింది. 2018లో అధికారికంగా ‘‘for8’’ను స్థాపించింది.

Mudita Akoijams business model inspiration story

మణిపుర్‌లోని తౌబాల్‌లో చిన్న ఆఫీసునుంచి కార్యకలాపాలు మొదలుపెట్టింది. మొదట్లో ముంబైలోని 20 రెస్టారెంట్లకు తన వస్తువుల్ని అమ్మటం మొదలుపెట్టింది. ప్రతీ నెలా దాదాపు 1000 కేజీల బ్లాక్‌ రైస్‌ అమ్మకాలు జరిగేవి. రైతులను తన వ్యాపారంలో భాగం చేసుకుని, వారికి మంచి మంచి సలహాలు ఇచ్చి పంటలు పండించేది. తర్వాత అస్సాంనుంచి హిమాలయన్‌ రెడ్‌ రైస్‌, నాగాలాండ్‌నుంచి బాంబు షూటిన్‌ను మరి కొన్ని టీ ఆకులను కూడా అమ్మటం మొదలుపెట్టింది. ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంతో ముందుకు సాగింది. అనుకున్నది సాధించటం కోసం నూటికి నూటి శాతం కష్టపడింది.. పడుతోంది. వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకూ విస్తరిస్తూ పోతోంది. మరి, ముదిత సక్సెస్‌ ఫుల్‌ బిజినెస్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Mudita Akoijams business model inspiration story

ఇవి కూడా చదవండి : Sneha Sirivara: లక్ష జీతం వచ్చే జాబ్ వదిలేసి.. చిన్న ఆలోచనతో నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది!

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.