ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. 43 బిలియన్ డాలర్ల డీల్!

Elonmusk handover twitter

ఎలాన్ మస్క్‌ ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ఆఫర్ ప్రకటించి పది రోజులు గడుస్తోంది. ట్విట్టర్ లో వాటాదారుగా చేరిన ఎలాన్ మస్క్ మరికొన్ని గంటల్లో ఆ సంస్థ మొత్తానికే యజమాని కాబోతున్నట్లు సమాచారం. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విటర్ బోర్డు సైతం తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. కానీ, మస్క్ ఊరుకోలేదు. తాను ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేసేలా ఎప్పటికప్పుడు సంకేతాలిస్తూ వచ్చారు. చివరకు లావాదేవీకి కావాల్సిన నిధుల్ని కూడా సిద్ధం చేసుకున్నారు.

మొదట నుంచి మస్క్ ఆఫర్ ను వ్యతిరేకిస్తూ వచ్చిన బోర్డు.. మనసు మార్చుకుని ఓకే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. షేర్ హోల్డర్లు సైతం ఒత్తిడి తేవడంతో ట్విట్టర్ బోర్డు ఆదివారం సమావేశమైంది. బోర్డుతో పాటు షేర్ హోల్డర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరి మస్క్ తో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ కొనుగోలుపై ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నాయని, ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరితే ఎన్నాళ్లలో పూర్తిచేయాలి? ఫీజులు వంటివి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆండ్రాయిడ్‌ యూజర్లకి బిగ్ షాక్.. గూగుల్‌ కీలక నిర్ణయం!

ట్విట్టర్ కొనుగోలుకు ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లు(రూ.3.22లక్షల కోట్లు) చెల్లించడానికి ఏప్రిల్ 14న తొలిసారి మస్క్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ మేరకు ఆయన వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కొనుగోలు సౌలభ్యం కోసం హోల్డింగ్ కంపెనీని సైతం రిజిస్టర్ చేయించారు మస్క్.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.