ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్లైన్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలకు షిఫ్ట్ అయ్యారు. ఈ యాప్‌ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం వస్తోంది. ఇందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం మెషీన్లను ఎన్సీఆర్ కార్పొరేషన్క్రమంగా అప్డేట్ చేస్తోంది. ఇప్పటికే కొన్నిఏటీఎంలను అప్‌గ్రేడ్ చేయగా.. మరిన్ని వాటికి త్వరలో ఈ ఫీచర్ రాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్స్ ద్వారానే ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. అంటే డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న మాట. యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే.. ఈ సర్వీస్‌లకు అప్‌గ్రేడ్ అయిన ఏటీఎం ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్‌పే, పేటీఎం లాంటి ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్స్ యాప్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పని చేస్తుండాలి. ఏటీఎం ద్వారా ఫోన్ పే, గూగుల్ పేతో నగదు విత్‌డ్రా చేసుకునే విధానం.. 1.ముందుగా ఏటీఎం మెషీన్ వద్దకు వెళ్లాలి. దాంట్లో విత్‌డ్రా క్యాష్ (Withdraw Cash) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 2.అప్పుడు ఏటీఎం మెషీన్ స్క్రీన్‌పై UPI ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. 3.అనంతరం ATM స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. 4.అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ ఓపెన్ చేసి.. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. 5.కోడ్ స్కాన్ పూర్తయ్యాక.. ఎంత మేర విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. (ప్రస్తుతం లిమిట్ రూ.5,000గా ఉంది.) 6.ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేసి.. మొబైల్లో యూపీఐ పిన్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డబ్బు విత్‌డ్రా పూర్తవుతుంది. అంటే యూపీఐ యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. చెల్లింపులు చేసినట్టే ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా? ఇది కూడా చదవండి: ట్రాన్సాక్షన్స్‌పై బాదుడు మొదలుపెట్టిన ఫోన్‌పే! మండిపడుతున్న నెటిజన్లు