బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు పుణ్యమాని అందరూ తమ తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వారి బ్రేకప్ స్టోరీలే నడుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అరియానా గ్లోరీ లవ్ బ్రేకప్ బాగా వైరల్ అవుతోంది. తాను చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమకు దూరమైనట్లు.. ఆ తర్వాత 9వ తరగతిలో తన బావకు దగ్గరైన తనను అతను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: తన బ్రేకప్ లవ్ స్టోరీపై బిందు మాధవి ఆసక్తికర వ్యాఖ్యలు
‘తొమ్మిదో తరగతిలోనే నా ప్రేమ మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచి నాన్న లేరు. అబ్బాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు. పదో తరగతి వచ్చేసరకి నా ప్రేమ సీరియస్ అయ్యింది. తను విజయవాడలో ఉండేవాడు. రోజూ తిన్నావా, వచ్చావా అంటూ అడగడం నచ్చేది. అతను చూపించే కేరింగ్ బాగా నచ్చేది. ఇంటర్ అయ్యేసరికి నేను ఇంట్లో నుంచి బయకు వచ్చాను. అతనిది డిగ్రీ అయిపోయి జాబ్ వచ్చింది. ఇద్దరం హైదరాబాద్ లో కలిసున్నాం.’
‘మూడేళ్లు కలిసున్నాం.. ఒకానొక టైమ్ లో బోర్ కొడతాం అంటారు కదా? నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అదే అనిపిస్తోంది. అతనికి స్పేస్ కావాలి అనిపించింది అనుకున్నాను. ఒకరోజు నేను చూడకూడనిది చూశాను. అది ఏంటో ప్రపంచానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ సమయంలో నా హార్ట్ బ్రేకైంది. ఇంక వద్దు అనుకున్న పరిస్థితిలో తను వచ్చి వివరణతో ఇంకో రెండేళ్లు కలిసే ఉన్నాం. నాకు ఆర్జే కావడం ఇష్టం అని చెప్పాను. సరే ట్రై చెయ్యి అన్నాడు. ఆ క్రమంలో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. దానికి మా బావ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అది కచ్చితంగా మిస్ అండర్ స్టాండింగ్. ఆ తర్వాత ఈ అనుమానాలు నాకొద్దు అనుకుని బ్రేకప్ చెప్పి బయటకు వచ్చాను.’
ఇదీ చదవండి: హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట భారీ చోరీ.. నగలు, డబ్బుతో పరారీ!
‘వచ్చిన మూడు నాలుగు నెలలదాకా మా బావే గుర్తొచ్చాడు. తప్పు చేశాను అనుకుని ఫోన్ చేశాను. మళ్లీ మాట్లాడమని బతిమిలాడాను. ఓ రోజు మా అత్తకోసం పింక్ శారీ తీసుకుని తెల్లవారుజామున 4 గంటలకే వెళ్లి తలుపుకొట్టాను. మా బావ డోర్ ఓపెన్ చేసి.. ఈ టైమ్ లో ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. అంటూ రోడ్డు మీద కూర్చోబెట్టే మాట్లాడాడు. నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత నా డబ్బు, నా ప్రాబ్లమ్స్, అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు. నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను. నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు ఒకవేళ వచ్చి నాకు వద్దు ఇంక. బావా ఆనంద్ ఇప్పటికీ నాకు కాల్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తుంటాను’ అంటూ అరియానా తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.