‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ తో దూసుకుపోతోంది. ఛాలెంజర్స్ నుంచి అనీల్ రాథోడ్ ఇంటి రెండో కెప్టెన్ గా అయిన విషయం తెలిసిందే. ఛాలెంజర్స్ హౌస్ లో గట్టి పోటీనే ఇస్తున్నారు. యాంకర్ శివకు వారియర్స్ లోని సరయు, నటరాజ్ మాస్టర్, మహేశ్ లతో తరచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నామినేషన్ సమయంలోనూ సరయు నువ్వు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావ్ అని నింద వేసింది. అందుకు నటరాజ్ మాస్టర్ కూడా అవును నువ్వు అన్నావ్ అని చెప్పాడు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ తో బూతులు మాట్లాడిన యాంకర్ శివ!
‘నేను పక్కనే ఉన్నాను. నువ్వు డబుల్ మీనింగ్ లో వెటకారంగా మాట్లాడావు. నీ పిండి నేను పిసకలేను.. పిసికే వాడిని పంపిస్తాను అన్నావ్’ అని నటరాజ్ మాస్టర్ చెప్పాడు. తేజస్వి వెటకారం వేరు.. డబుల్ మీనింగ్ వేరు అని చెప్తుంది. ఆ సమయంలో యాంకర్ శివ ‘మీరు చెప్పిన మాటలు నేను అన్నట్లు చూపిస్తే ఎవరూ నన్ను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు యాంకర్ శివ- సరయు మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఆ రోజు సరయు దూరంగా ఉన్న శివను పిలిచి.. శివ పిండి కలిపి ఇవ్వవా. నేను రొట్టెలు చేస్తాను అని అడుగుతుంది. అందుకు శివ పిసుక్కో.. నాకు చేతకాదంటాడు. లాస్ట్ సీజన్లో నేను రొట్టెలు చేస్తుంటే బాయ్స్ నాకు పిండి కలిపి ఇచ్చేవాళ్లు అంటూ శివతో పని చేయించాలని చూస్తుంది. అందుకు శివ బాగా పిసికే వాళ్లను పంపిస్తాను. నీకు పిండి పిసకడం కావాలి అంతే కదా? అని అడుగుతాడు. అలా ఆ సంభాషణ సాగింది. అందులో మరీ అంత పెడార్థం ధ్వనించలేదు. కానీ, కాస్త వెటకారం మాత్రం కనిపించింది. అయితే యాంకర్ శివను క్వశ్చన్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. నటరాజ్ మాస్టర్ చెప్పినట్లు ‘నీ పిండి పిసికే వాళ్లను పంపిస్తా’ అనే మాట అయితే శివ నోట రాలేదు అని మద్దతు ఇస్తున్నారు. యాంకర్ శివ నిజంగానే డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.