‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో మిత్రుల మధ్య వైరం ప్రేక్షకులను కళ్లనీళ్లు పెట్టిస్తోంది. ఎప్పుడు కలిసి తిరుగుతూ.. కలిసి తింటూ దోస్త్ మేరా దోస్త్ అంటూ ఉండే షణ్ముఖ్, సిరి, జెస్సీలు విడిగా ఉంటున్నారు. వారి మధ్య సీక్రెట్ టాస్క్‌తో మొదలైన గొడవ ఇంకా సద్దుమణగలేదు. షణ్ముఖ్ అయితే జెస్సీ, సిరిలపై ఎంతో అసంతృప్తిగా ఉన్నాడు. వారితో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడంటం లేదు. వారి కోపంతో షణ్ను అన్నం కూడా తినకుండా ఒక్కడే మోజ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్నాడు. షణ్నూని చూసి సిరి.. ఇదంతా నా వల్లే జరిగింది అంటూ జెస్సీ ముగ్గురూ ఏడ్చుకుంటూ తిరుగుతున్నారు.
బంగారు కోడిపెట్ట టాస్కు సమయంలో బిగ్‌బాస్ జెస్సీకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక సభ్యుడి సహాయం తీసుకుని ఇంట్లోని ముగ్గురు సభ్యలు వద్ద రెండో రౌండ్‌లో ఒక్క గుడ్డు కూడా లేకుండా జీరో చేయాలి. అందుకు జెస్సీ..సిరి సహాయం తీసుకుంటాడు. ఆమె షణ్ముఖ్, ప్రియ, ప్రియాంకలను ఒప్పించి వారి వద్ద జీరో ఉండేలా చూస్తుంది. అయితే ఈ టాస్కులో జెస్సీ బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్‌ని సరిగా అర్థం చేసుకోక టాస్క్‌లో విఫలమయ్యాడు. దాని వల్ల షణ్ను కూడా నష్టపోతాడు. అందుకే షణ్ను ఇప్పుడు అంత కోపంగా ఉన్నాడు.
ఇదీ చదవండి: నటి ప్రియకు దిమ్మతిరిగే షాక్.. కెప్టెన్ గా సన్నీ.. రేషన్ మేనేజర్ గా కాజల్!
మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు తొంగి చూసినందుకు అనే సామెత తెలుసు కదా? ఇప్పుడు షణ్ముఖ్ అందుకే ఇంతలా హర్ట్ అయ్యాడు. జెస్సీ సీక్రెట్ టాస్కు వల్ల షణ్ముఖ్ అకౌంట్ జీరో అయ్యింది. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ తర్వాత రవి షణ్నుతో గేమ్ ఆడటం నేర్చుకోరా అన్నాడు. ఆ మాటకు పక్కనే ఉన్న శ్రీరామ్ ఫక్కున నవ్వడంతో షణ్ముఖ్ బాగా ఫీల్ అయ్యాడు. అందుకే ఇప్పుడు ఇంతలా సిరి- జెస్సీలను దూరం పెడుతున్నాడు.
నామినేషన్ టైమ్‌లో సన్నీని ఉద్దేశించి షణ్ను చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు ‘తన ఫ్రెండ్స్‌ను కాపాడుకోవడానికి గేమ్ ఆడుతున్నాడు. గేమ్‌లో ఫ్రెండ్స్ ఏంటి బ్రో.. ఇండివిడ్యూవల్ గేమ్ ఆడకుండా ఏంటిది?’ అంటూ షణ్ను అన్న మాటలను ఇప్పుడు రిపీట్ చేసుకంటున్నారు. ఇప్పుడు షణ్ను మాత్రం ఫ్రెండ్స్ అయి ఉండి ఇలా చేస్తారా? నా ఫ్రెండ్సే నన్ను వెధవని చేశారు అంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు. అప్పుడు సన్నీని అలా అని.. ఇప్పుడు నువ్వు ఇలా స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఏంటని అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. షణ్ను అలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.