బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మరికాసేపట్లో ముగియనుంది. 15 వారాల పాటు అత్యంత విజయవంతంగా సాగిన ఈ షోకు కాసేపట్లో తెరపడనుంది. బిగ్ బాస్ హౌస్ విజేత ఎవరో తెలిపోనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీజే సన్నీ విజేత నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన షణ్ముక్ విజేత కాకుండానే బయటకి వెళ్లినట్లు సమాచారం. దీనిపై షన్ను అభిమానులు తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. షన్ను ఎలిమినేట్ కావడానికి సిరియే ప్రధాన కారణం అంటూ ఆమెపై షణ్ముక్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ గా మారిన షణ్ముక్ యూత్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. మొదట్లో అందరూ ఆయనే విన్నర్ అనుకున్నారు. ఓటింగ్ లోనూ మొదట్లో షన్నునే టాప్ లో ఉన్నాడు. ఎప్పుడైతే సిరితో హగ్ లు ప్రారంభించాడో అప్పటి నుంచి చాలా మందికి షన్నుపై వ్యతిరేకత ఏర్పడింది. ఆయన అభిమానులకు సైతం వారి ఇద్దరి ప్రవర్తన నచ్చలేదని సమాచారం. సిరి హన్మంత్ అమ్మ వచ్చి స్వయంగా హంగ్ చేసుకుకోవటం బాగాలేదని చెప్పిన వారు వినిపించుకులేదు. సిరి, షణ్ముక్ లు హద్దులు దాటి ప్రవర్తించారని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలోనే షన్నుకు ఓటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది. షన్నుకు ఓటింగ్ తగ్గడానికి సిరియే కారణమని షన్ను అభిమానులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఓటింగ్ లో సన్నీ ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సిరితో హగ్ ల వల్లే షన్ను ఓటింగ్ లో వెనుకబడి ఆయన తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుపెట్టిన షన్ను, సిరి కారణంగా ఎలిమినేట్ అయ్యాడని ఆయన అభిమాను సిరి పై కోపంగా ఉన్నట్లు సమాచారం. షన్ను ఓటమికి సిరియే కారణం అనే వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.