‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ సన్నీ విజయానంలో నిండిపోయాడు. మరోవైపు రన్నరప్ షణ్ముఖ్ మాత్రం స్టేజ్ పై నార్మల్ గా కనిపించినా.. అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దానిపై ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంత ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ ఎందుకు విన్నర్ కాలేకపోయాడు? షణ్ముఖ్ ఓటమికి కారణాలు తెలుసుకుందాం.
‘షణ్ముఖ్ జశ్వంత్’ ఈ పేరు నెటిజన్స్ కు సుపరిచితం. కేవలం యూట్యూబ్ తో ఒక స్టార్ గా ఎదిగాడు షణ్ముఖ్. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది షణ్ముఖ్ ఒక్కడే. తన యూట్యూబ్ ఛానల్ కు 44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాటలు కాదు. కానీ, షణ్ముక్ జశ్వంత్ ఎందుకు విన్నర్ కాలేకపోయాడు? అనేది అందరి ప్రశ్న. అసలు బిగ్ బాస్ సీజన్ లో షణ్ముఖ్ ను బ్యాడ్ చేసిన అంశాలు ఏంటంటే.. మొదటిది అందరికీ తెలిసిందే సిరితో రిలేషన్. అవును సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నా అని షణ్ముఖ్ చెప్పడం అందరికీ అంతగా నచ్చలేదు. సిరికి- షణ్ముఖ్ కి బయట వేరే వారితో రిలేషన్ ఉండటమే ప్రేక్షకుల్లో అంత బ్యాడ్ కావడానికి కారణం.
రెండో హగ్గు.. ఈ పేరు ఎక్కడ విన్నా కూడా వాళ్లిద్దరూ ఉలిక్కి పడతారేమో? అంతలా హగ్గు అనే పదం వారి జీవితాల్లోకి చొచ్చుకు పోయింది. సిరి తల్లి వచ్చి హగ్గులు నచ్చడం లేదు అన్న తర్వాత మరీ నెగెటివ్ అయిపోయాడు షణ్ముఖ్. కొన్నిసార్లు షణ్ముఖ్ వద్దని వారించినా సిరి వినలేదు. కొన్ని సిరి వద్దంటే షణ్ముఖ్ వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఈ హగ్గుల మ్యాటర్ మాత్రం సగటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం. హౌస్ మేట్స్, ఆడియన్స్ ను జడ్జ్ చేయడం కూడా షణ్ముఖ్ కు నెగెటివ్ అయ్యింది. అదే విషయం ప్రేక్షకులు క్వశ్చన్ రూపంలో సంధించారు.
ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం. అవతలి వాళ్లు వీళ్ల గురించి పాజిటివ్ గా మాట్లాడినా వాటిల్లోంచి నెగెటివిటీని తీసుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. మంచి చెప్పడానికి ట్రై చేసిన వారికి కూడా పేర్లు పెట్టడం ఇంకో కారణం. తనకంటూ ఒక జోన్ ఏర్పాటు చేసుకుని అందులో కేవలం ఇద్దరికి మాత్రమే చోటిచ్చాడు షణ్ముఖ్. అది కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇంట్లో 18 మంది సభ్యులు ఉంటే షణ్ను క్లోజ్ అయ్యింది కేవలం ఇద్దరికి మాత్రమే. ప్రతిసారి సిరి తల్లిని బ్యాడ్ చేస్తూ హగ్గు ఒక్కటే కనిపించిందా అనే ప్రశ్న నెగెటివిటీని మూట కట్టింది. శ్రీహాన్ విషయంలోనూ షణ్ముఖ్ సరైన రీతిలో స్పందించలేదని కామెంట్ చేస్తున్నారు.
44 లక్షల ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్ టైటిల్ విన్నర్ కాలేదు అంటే.. అతని అభిమానులు సైతం ఓట్లు వేయలేదనే కంక్లూజన్ కు వచ్చేస్తున్నారు. కారణాలు ఏమైనా షణ్ముఖ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. షణ్ముఖ్ ఓటమికి ప్రధాన కారణం ఏదై ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.