‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి 14వ వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని భావించారు కొందరు. కానీ, బిగ్ బాస్ మాత్రం అలాంటి సాహసాల జోలికి పోకుండా అందరూ ఊహించిన విధంగానే టాప్ 5ను డిసైడ్ చేశాడు. మొదటి నుంచి సిరి టాప్ 5లో ఉటుంది అనుకున్నారు అలాగే చేశాడు బిగ్ బాస్. ఆర్జే కాజల్ మాత్రం తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోలేకపోయింది. కాజల్ జర్నీ 14వ వారంతో ముగిసింది.
ఆర్జే కాజల్ ఎలిమినేషన్ అవ్వడం వెనుక పెద్ద రాజకీయాలు ఏమీ లేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్న ఆరుగురిలో కాజల్ కే ఫ్యాన్ బేస్ తక్కువ అని అందరికీ తెలుసు. పార్టిసిపేషన్, టాస్క్ లో పోటీ పడటం ఇలాంటివి లెక్కలోకి తీసుకున్నా కూడా కాజల్ కంటే సిరినే ముందుంటుంది. కాజల్ మొదటి నుంచి ఇంట్లో నెగెటివిటీని మోస్తూనే ఉంది. ఎంతో మంది హౌస్ మేట్స్ మాకు కాజల్ తో కనెక్షన్ లేదు అని చెప్పేవాళ్లు.
యానీ మాస్టర్ అయితే నాకు కాజల్ ను చూస్తే నెగెటివ్ వైబ్ వస్తుంది అనేది. ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునే రవిని కూడా హౌస్ లో చాలా బ్యాడ్ చేసింది కాజల్. మొదట షణ్ముఖ్, తర్వాత మానస్, ఇప్పుడు సన్నీ తన ఫ్యావరెట్ కంటెస్టెంట్ అని చెప్పండ కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. ఒక ఒపీనియన్ కు స్టిక్ అవ్వలేదు అని భావించారు. కొన్ని నిర్ణయాల్లోనూ కాజల్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేక పోయింది. బిగ్ బాస్ మొత్తాన్ని ముందే అవపోసన పట్టి వచ్చింది కాజల్ అని కంటెస్టెంట్స్ ఎప్పుడూ అంటుంటారు.
ఆమె ఏ పని చేసినా అది రికార్డు అవ్వడం కోసమే చెస్తుందేమో అనుకునే భావనకు వచ్చేశారు. అంటే మొత్తంలో కాజల్ ఇంట్లో నటిస్తోందేమో అని ఫీలింగ్ బాగా బిల్డ్ అయ్యింది. చివరి వారంలో శ్రీరామచంద్రతో గట్టిగానే గొడవ పడింది. ఏ విషయాన్ని ఒక పట్టాన ఒప్పుకోకుండా తన చేతులారా తానే ఇంకా నెగెటివ్ అయ్యింది. చిన్న కారణానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ సింపథీ కార్డ్ కోసం ట్రై చేసిందేమో అనే నిర్ణయానికి ఆడియన్స్ వచ్చేలా చేసింది. కాజల్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఇద్దరు మాత్రం బాగా ఫీల్ అవుతారు. మిగతా ముగ్గురు ఆ ఎలిమినేషన్ ను ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్జే కాజల్ ఎలిమినేట్ కావడానికి కారణం ఆమె ప్రవర్తనేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.