కూతురుని చూసి ఎమోషన్ అయిన కాజల్.. బుర్ర హీటెక్కుతుందన్న షణ్ముక్!

బిగ్ బాస్ షో 11 వారాలు పూర్తిచేసుకుని 12 వ వారంలో అడుగుపెట్టింది. టాస్క్ పరంగా ఎప్పుడు హడావుడి.. కోపతాపాలతో ఘర్షణ పడుతూ ఉంటే ఒక రకంగా టాస్క్ అంటేనే వైల్డ్ గా బిహేవ్ చేసే ఇంటి సభ్యులు ఈ రోజు మాత్రం కాస్త నవ్వులు పూయించినట్టే ఉన్నారు. నామినేషన్స్ హడావుడి, కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఈ రోజు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

image 3 compressed 1‘బీబీ ఎక్స్‌ప్రెస్‌’ టాస్క్‌ లో భాగంగా ‘చుక్‌ చుక్‌ చుక్‌’ అంటూ బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులుతీయాలి. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. అంతే కాదు ఫార్వర్డ్, పాజ్ అంటూ ఆదేశాలివ్వడంతో ఇంటి సభ్యులంతా ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో హౌస్ మేట్స్ గొడవతో ప్రారంభమైనా ఈ వారంలో అద్భుతమైన సర్ ప్రైజ్ ని అందించాడు బిగ్ బాస్. ఈ సీజన్ లో ఇంటి సభ్యుల తాలూకా కుటుంబసభ్యులని వారికి చూపెట్టడంతో ఎమోషన్ల పర్వం కొనసాగింది.

image 0 compressed 4ఈ సీజన్‌లో ఒక్క కంటెస్టెంట్ తరపున ఇద్దరు కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో జరిగిన సీజన్లలో కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు. తాజాగా కాజల్ కుటుంబం నుంచి ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. కాజల్ కూతురు ని చూడగానే ఎంతో ఎమోషన్ అయ్యింది. తల్లీ కూతుళ్ల ప్రేమను చూసి సిరి కన్నీరు పెట్టుకుంది. కాజల్ కూతురితో మీ అమ్మను నామినేషన్ చేస్తే నీకు కోపం వస్తుందా అన్న ప్రశ్నకు తల ఊపుతూ అవును అనే సంకేతాలు ఇచ్చింది.

image 2 compressed 4ఇక సింగర్ శ్రీరామ చంద్ర ఇంటి నుంచి ఒకరు వచ్చారు. ఆమెను చూసి శ్రీరామ్ చాలా ఎమోషన్ అయ్యారు. చివరిగా షణ్ముక్ బిగ్ బాస్ తో సార్ బిగ్ బాస్ సార్.. మీరు ఎవర్ని పంపిస్తున్నారో చెప్తే.. నా బుర్ర.. ప్లీజ్ అంటున్న సమయంలో ఒకరు ఎంట్రీ ఇవ్వడం ఉత్కంఠత రేపింది. ఏది ఏమైనా ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ లో కుటుంబ సభ్యుల తో ఎమోషన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.