స్పెషల్ డెస్క్- దీప్తి సునయన న్యూ ఇయర్ సందర్బంగా యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌కి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రియురాలు దీప్తీ. షణ్ముఖ్ కెరియర్ ప్రారంభం నుంచి ఆర్ధికంగా హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. ఆ తరువాత షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా, అతని గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి సునయన.
ఐతే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన కొన్ని రోజులకే వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధమలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్, సిరి హనుమంత్ కి దగ్గర కావడం, హగ్‌లు.. ముద్దులతో రెచ్చిపోవడంతో దీప్తికి నచ్చేలేదు. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి రొమాన్స్ చేయడం, ఒకరిని విడిచి మరొకరు బతకలేరు అన్నవిధంగా వ్యవహరించడం దీప్తి సునయనకి ఏ మాత్రం నచ్చలేదు.
కేవలం దీప్తీ సునయన మాత్రమే కాదు, షణ్ముఖ్, సిరిల ప్రవర్తన బిగ్ బాస్ ఫ్యామీలీ ఆడియన్స్ సైతం ఓ దశలో చీదరించుకున్నారు. వీళ్లిద్దరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఎంకరేజ్ మెంట్ ఫుల్‌గా ఉండటంతో అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇవన్నీ బయట నుంచి చూసిన సునయన తట్టుకోలేకపోయింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే బ్రేకప్ చెప్తే అతని గెలుపుకి ఇబ్బంది అవుతుందని, సీజన్ ముగిసేవరకూ ఎదురుచూసింది.
ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిందో అప్పటి నుంచి దీప్తీ సునయన ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడుతూనే ఉంది. షణ్ముఖ్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి బ్లాక్ చేసింది. వీళ్లిద్దరూ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇక ముసుగులో గుద్దులాట వద్దనుకుందో ఏమో, తన బ్రేకప్‌ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది దీప్తీ.
షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్తూ దీప్తి పెట్టిన పోస్ట్ లో ఏమందంటే.. చాలా ఆలోచించి, మాట్లాడుకున్న తర్వాత షన్ముఖ్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతో విడిపోయి వ్యక్తిగతంగా జీవించాలనుకుంటున్నాం. ఇకపై ఎవరి దారిలో వాళ్లం వెళ్దామని నిర్ణయించుకున్నాం. మేం ఇద్దరం కలిసి ఉన్న ఈ ఐదేళ్లలో హ్యాపీగా, ఎంతో అప్యాయంగా ఉన్నాం.. కానీ మాలోని రాక్షసులతో పోరాడటం కూడా కష్టంగా ఉంది.. అందరూ కోరుకున్నట్లే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. అని చెప్పింది.
బ్రేకప్ అనేది సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదు.. మా బ్రేకప్ చాలా కాలం కొనసాగుతుంది.. మనస్పర్దలు వచ్చినప్పుడు మేము కలిసి ఉండటానికి చాలానే ప్రయత్నించాం.. జీవితంలో ముఖ్యమైన దాన్ని విస్మరిస్తూ ఉండటం నచ్చడం లేదు.. మా మార్గాలు కూడా భిన్నమైనవి.. ఒకే చోట చిక్కుకుని ఉండకుండా ముందుకు సాగాలని మేము తెలుసుకున్నాం.. అని చాలా ఎమోషనల్ గా ఇన్ స్టా గ్రామ్ లో చెప్పుకొచ్చింది దీప్తి.
షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్తూ దీప్తి సునయన తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్ధిస్తున్నారు. మీరు వంద శాతం మంచి నిర్ణయం తీసుకున్నారని, మీ ఈ నిర్ణయానికే కట్టుబడి ఉండండని.. కామెంట్స్ చేస్తున్నారు.