‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులే ఉంది. తమ అభిమాన కంటెస్టెంట్ కు ఓట్లు వేయండని ఫ్యాన్సే కాదు ఎక్స్ హౌస్ మేట్స్ కూడా ప్రచారాలు చేస్తున్నారు. అందులో యాంకర్ రవి ఆ కంటెంస్టెంటునే గెలిపించండని గట్టినా క్యాంపైన్ చేస్తున్నాడు. ప్రచారం చేయడమే కాదు.. అతనే డిసర్వింగ్ కంటెస్టెంట్ అంటూ స్టేట్ మెంట్ కూడా ఇస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. హౌస్ లో ఉన్న షణ్ముఖ్ బ్రదర్ కోసం ప్రచారం చేస్తున్నాడు అనుకుంటే మీరు పొరపడినట్లే. యాంకర్ రవి ప్రచారం చేస్తోంది.. సింగర్ శ్రీరామచంద్ర కోసం.
అవును సింగర్ శ్రీరామచంద్రను గెలిపించండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. తన ఒపీనియన్ ను వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. అయితే షణ్ముఖ్ అంటే నా తమ్ముడు లెక్క అని చెప్పిన రవి ఇప్పుడు శ్రీరామ్ కోసం ప్రచారం చేయడం కాస్త డిఫరెంట్ గా ఉండచ్చు. కానీ అందుకు కారణాలు లేకపోలేదు. హౌస్ లో రవి తమ్ముడు అనుకున్నాడు కానీ, షణ్ముఖ్ మాత్రం ఇన్ ఫ్లుఎన్సర్ అన్నాడు. మరోవైపు శ్రీరామచంద్ర- రవికి ఎంతో వాల్యూ ఇచ్చాడు.
చివర్లో వారి బాండింగ్ మరింత ఎక్కువైంది. అదే ఇప్పుడు శ్రీరామ్ కోసం ప్రచారం చేసేలా చేసిందని అభిమానులు భావిస్తున్నారు. మరి అసలు విన్నర్ ఎవరు అవుతారో తెలియాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.