Politics

కాంగ్రెస్‌కు స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు రాజీనామా..!

కాంగ్రెస్‌కు స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు రాజీనామా..!

శంషాబాద్ పార్టీ కార్యాల‌యంలో కార్తీక్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసి అక్క‌డ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను చించేశారు. పార్టీ కార్యాల‌యం వ‌ద్ద కార్య‌ర్త‌ల‌తో క‌లిసి నిర‌స‌న తెలియ‌జేశారు.  ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతుండ‌గానే ఇక్క‌డ రాజీనామాల ప‌ర్వం మొద‌లైపోయింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి.

మీ ఓటు హక్కును దొబ్బేసారా? ఐతే ఇలా చేయండి..!

మీ ఓటు హక్కును దొబ్బేసారా? ఐతే ఇలా చేయండి..!

ఒక నోటు సామాన్యుడి తలరాత మారుస్తుందో లేదో తెలీదు కానీ, ఒక దొంగ ఓటు మాత్రం రాష్ట్రాన్నే తలకిందులు చేసి పడేస్తుంది. ఒక్క దొంగ ఓటు చాలు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి. అదే ఒక్క ఓటు చాలు ఈ దేశాన్ని బాగు చేయడానికి. కరెక్ట్ గా మన ఓటు హక్కుని వినియోగించుకుని సరైన నాయకుడ్ని ఎన్నుకుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. కానీ ఒకరి ఓటు మరొకరు వేసి దొడ్డి దారిలో గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి కేసులు ఎన్నో చూశాం.

Tags

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

తెలంగాణ‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా టూర్ ఖ‌రారైంది.  ఈ నెల 25న మిత్ షా హైద‌రాబాద్‌కు రానున్నారు. అమిత్ షా ఏఏ స‌భ‌ల్లో పాల్గొంటారు. ఏఏ ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తార‌నేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తాయంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లుమార్లు ప‌ర్య‌టించిన అమిత్ షా జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి, నేత‌ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపాల‌ని క్లాస్ పీకారు. 

టీడీపీ రెండో జాబితాపై కాంగ్రెస్‌లో లొల్లి..!

టీడీపీ రెండో జాబితాపై కాంగ్రెస్‌లో లొల్లి..!

 

తెలంగాణ మ‌హా కూట‌మిలో సీట్ల సిగ‌ప‌ట్లు రంగారెడ్డి జిల్లాలో కాక‌రేపుతున్నాయి. పైకి పొత్తంటూనే లోలోప‌ల ర‌గిలిపోతున్న ఆశావ‌హులు  ఎవరికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత మంది రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగుతుంటే మ‌రికొంద‌రు సీట్ల కోసం త‌మ‌దైన స్టైల్లో లాబీయింగ్ చేస్తున్నారు. అభ్య‌ర్థుల అనుచ‌రుల ఆందోళ‌న శృతి మించ‌డం హైక‌మాండ్‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది.

Tags

టీఆర్ఎస్ నేత హ‌త్య‌కు రెక్కీ..!

టీఆర్ఎస్ నేత హ‌త్య‌కు రెక్కీ..!

తెలంగాణ‌లో ఓ వైపు ఎన్నిక‌ల హ‌డావుడి కొన‌సాగుతుంటే, మరో వైపు మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లోని పాత వ‌రంగ‌ల్ జిల్లా ఖ‌మ్మం జిల్లా అట‌వీ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారాన్ని పోలీసులు ప‌సిగ‌ట్టారు.  ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు అనుమానిస్తున్నారు. 

Tags

కోడిక‌త్తికి, చంద్ర‌బాబుకు సంబంధం ఏమిటి..? :మ‌ంత్రి ప‌రిటాల సునీత‌

 స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు బుధవారం ఘనంగా రాష్ట్ర స్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం  బాలల దినోత్సవ వేడుకలు-2018  కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి పరిటాల సునీత, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, పాల్గొన్న కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఛైర్పర్సన్ జి.

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన కేసీఆర్‌

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కాసేప‌టి క్రితం ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు కోనాయిప‌ల్లి ప్ర‌ముఖ దేవ‌స్థానం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీశ్‌రావు కూడా స్ఆమివారిని ద‌ర్శించుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల రెండో జాబితా విడుద‌ల‌..!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల రెండో జాబితా విడుద‌ల‌..?

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప‌ది మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టిస్తూ రెండో జాబితాను ప్ర‌క‌టించింది. అయితే, సోమ‌వారం రాత్రి 65 మంది పేర్ల‌తో కూడిన ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను కాంగ్రెస్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్ప‌టి వ‌ర‌కు 75 మంది అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించింది.

ఇవాళ కేసీఆర్ నామినేష‌న్‌..!


ఇవాళ కేసీఆర్ నామినేష‌న్‌..!

ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోనాయ‌ప‌ల్లి శ్రీ వేంక‌టేవ్వ‌ర స్వామి ఆల‌యానికి చేరుకున్నారు. ఆల‌యంలోని శ్రీ వేంక‌టేవ్వ‌ర స్వామి వారి ముందు నామినేష‌న్ ప‌త్రాల‌ను ఉంచి  ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కేసీఆర్ త‌న పార్టీ త‌రుపున ముఖ్య కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌ద‌ల‌చిన‌ప్పుడ‌ల్లా ఈ ఆల‌యానికి రావ‌డం సెంటిమెంట్‌గా ఉంది.  నామినేష‌న్ దాఖ‌ల ఉచేసే ప్ర‌తీసారి కూడా  కేసీఆర్ కోనాయిప‌ల్లి శ్రీ వేంక‌టేవ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు కేసీఆర్‌.