ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్బంధీగా పహారా కాస్తున్న అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్నది.. ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ‘పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం యూపీ పోలీసులు పుష్ప సినిమా డైలాగ్ తో స్మగ్లర్లకు ధమ్కీ ఇచ్చిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లా గగల్ హేరి పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువ చేసే 11,050 కిలోల కలపను పోలీసులు పట్టుకున్నారు. ఆ స్మగ్లర్ల వివరాలను పుష్ప సినిమా డైలాగ్ తో ట్వీట్ చేశారు. “మాల్ మిలేగా ఔర్ పుష్పా భీ మిలేగా” అంటూ ట్విట్ చేశారు. నెట్టింట ఆ ట్వీట్ వైరల్ కావడమే కాదు.. పోలీసుల కాన్ఫిడెన్స్ ను కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మరి యూపీ పుష్పరాజ్ లు పద్ధతి మార్చుకుంటారేమో చూడాలి.
माल मिलेगा और पुष्पा भी मिलेगा!#PushingPushpaBehindBars #PushpaRaj #Pushpa pic.twitter.com/WfwEZg62zL
— UP POLICE (@Uppolice) February 7, 2022