Truck Tire: మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. చావు రాసి పెట్టి ఉంటే విశ్వంలో ఎక్కడ దాగున్నా మరణం తప్పదు. తాజాగా, ఓ వ్యక్తి జీవితాన్ని ట్రక్కు టైరు రూపంలో మృత్యువు కబళించింది. ఊడిన ట్రక్కు టైరు ఢీకొట్టడం వల్ల సదరు వ్యక్తి రోడ్డుపైనే కన్నుమూశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, శ్రీపెరంబదూర్‌కు చెందిన 45 ఏళ్ల మురళి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. జూన్ 1వ తేదీన ఇంటి సరుకులు తీసుకురావటానికి ఓ షాపులోకి వెళ్లాడు. సరుకులు తీసుకుని బయటకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాడు.
ఓ చోట స్కూటీ పక్కన నిలబడి షర్టు పాకెట్‌లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి వెనకాల నుంచి ఓ టైరు దూసుకువచ్చింది. వేగంగా వచ్చిన ఆ టైరు మురళిని ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి ముందుకు పడ్డాడు. అది అతడ్ని తొక్కుకుంటూ ముందుకు దూసుకుపోయింది. అక్కడే ఉన్న జనం ఆ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. ఆ టైరు ఎక్కడినుంచి, ఎలా వచ్చిందని వాళ్లకు అర్థం కాలేదు.
కొద్దిసేపటి తర్వాత అది ట్రక్కు టైర్ అని తెలుసుకున్నారు. మురళిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అన్ని సోషల్ మీడియా వేధికల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు మురళి మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Goat: మేకను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..