కళ్లతో చూసేవన్నీ నిజాలు కాదు. నిజమో, అబద్ధమో పక్కన పెడితే కొన్నికొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని ఆలోచనలో పడేస్తాయి. సోషల్‌మీడియాలో కనిపించే అలాంటి వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతాయి. అలాగే వైరల్ అయిన ఈ ఇమేజ్‌ని చూస్తే ఒకింత భయపడతారు కూడా. తాజాగా న్యూయార్క్ నగరంలోని ఓ వంతెన కింద దొరికిన ఒక దృశ్యం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో ఈ దృశ్యం షేర్ చేశారు. గూగుల్ ఎర్త్‌లో నమోదైన ఈ భయనక ముఖాన్ని చూసి చాలామంది దెయ్యం అంటున్నారు. కొంతమంది మాత్రం జోకర్ అని చెబుతున్నారు. చిత్రంలో వంతెన కింద నుంచి భయానక ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లోని హైవే వంతెన అయిన కయుగా వాటర్ ఫ్రంట్ ట్రయిల్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటర్నెట్లో వైరల్ అయిన వీడియోని చాలా మంది చూశారు. కొందరు దెయ్యం అంటుంటే.. మరికొందరు ఆ ప్రదేశాలకు వెళ్లకండని సూచిస్తున్నారు.
ఆ దృశ్యంలో కనిపిస్తున్న ముఖం తెల్లగా, కళ్లు లోతుగా నల్లగా ఉన్నాయి. కాకపోతే, అక్కడ కేవలం మొఖం మాత్రమే కనిపిస్తోంది. అదికూడా అచ్చు దెయ్యం అలంకరణలో ఉంది. ఆ దృశ్యాన్ని ఇప్పటివరకు 10 లక్షల మంది వరకు చూశారు. కామెంట్ చేసినవారిలో చాలా మంది ఆ వంతెన కిందకు వెళ్లొద్దని చెప్పారు.