జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా.. సక్సెస్ కావాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. ఈ మాటను సమర్థించేవారు ఉన్నారు.. వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చదివితే మీరు కూడా కొన్నిసార్లు లక్ ఉండాలేమో అంటారు. అవును ఒక పెయింటర్ గా 50 ఏళ్లు కష్టపడినా తాను సాధించలేకపోయిన సక్సెస్.. ఒక్క లాటరీ టికెట్ వచ్చేసింది. మరి అది అదృష్టం అనక ఏమనాలి? మరి, ఆ అదృష్టవంతుడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసుకోండి.
కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా పెయింటర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తన జీవితంలో ఎదిగేందుకు ఆస్తులు సంపాదించలేకపోయినా.. బతికేందుకు అప్పుల చేయక తప్పలేదు. చాలా అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో కూడా అతనికి దిక్కు తోచని పరిస్థితి. అప్పుడు సదానందన్ కు ఒక ఆలోచన వచ్చింది. అప్పుల తీర్చేందుకు లాటరీ టికెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచన ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా.. అదే అతడిని కోటీశ్వరుడిని చేసింది.
క్రిస్మస్- న్యూఇయర్ సందర్భంగా కొట్టాయంలోని బెంజ లాటరీస్ ఏజెన్సీకి చెందిన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా ఆ టికెట్ విక్రయాలు ముగిసే కొన్ని గంటల ముందే కొన్నాడు. కొని ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే అతడికి లాటరీ ఏజెన్సీ నుంచి మెసేజ్ వచ్చింది. లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్లు గెలుచుకున్నారని. లాటరీ టికెట్ నంబరు: XG 218582 కు రూ.12 కోట్లు వచ్చాయి. సదానందన్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. లాటరీలో గెలుచుకున్న మొత్తంతో అప్పులు తీర్చేసి.. పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగిస్తానంటూ సదానందన్ తెలిపాడు. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకుంటారా కొన్నిసార్లు అదృష్టం కూడా ఉండాలి అని? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.