సాధారణంగా తోక జంతువులకు ఉంటుంది. అదే తోక మనుషులకు ఉంటే అందరు విచిత్రంగా చూస్తారు. అలానే నేపాల్‌లోని ఓ యువకుడికి తోక ఉంది. దేశాంత్ అధికారి అనే ఓ 16 ఏళ్ల యువకుడికి తన వీపువైపు నడుముకు మధ్యలో 70 సెం.మీ పొడవున్న తోక ఉంది. దీంతో దేశాంత్ అందరిని దృష్టిని ఆకర్షించాడు. అది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది అయితే అతడిని..హనుమంతుడి పునర్జన్మగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నేపాల్ లోని ఓ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో దేశాంత్ జన్మించాడు. దేశాంత్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత అతని తల్లిదండ్రులు చిన్న తోకను గుర్తించారు. స్థానికులు వింతగా చూశారు. ఆ సమస్యకు చికిత్స కోసం చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. విదేశాల్లోని డాక్టర్లను సైతం సంప్రదించారు. ఎవరు దేశాంత్ తోక సమస్యకు చికిత్స చేయలేకపోయారు. వారి నివాస ప్రాంతంలో ఉండే ఓ పూజారి.. దేశాంత్ ను హనుమంతుడి పునర్జన్మ అని చెప్పాడు. దీంతో దేశాంత్ తల్లిదండ్రులు ఆనందపడ్డారు. అయినా కొన్నాళ్ల పాటు తన తోక గురించి బయట తెలియకుండా ఇబ్బంది పడుతూ..జాగ్రత్త పడ్డాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని తన తోక గురించి బయట వారికి తెలియజేశాడు.
తోక విషయంలో ఒకప్పుడు ఇబ్బంది పడ్డానని, కానీ ఇప్పుడు తనకున్న తోకను చూపించడంలో ఎటువంటి అసౌకర్యం లేదని దేశాంత్ చెప్పాడు. అంతేకాదు తనను ఇప్పుడు చాలామంది హనుమాన్ అని కూడా పిలుస్తున్నారని చెప్పాడు.అయితే కొంతమంది మాత్రం దీనిని సైన్స్ పరంగా చూస్తున్నారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి అసాధారణ సంఘటనలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. తోకతో ఉన్నఈ నేపాల్ యువకుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.