Viral Video: సాధారణంగా సింహాన్ని ఫేస్ టు ఫేస్ చూడగానే జనం భయంతో బిక్కచచ్చిపోతారు. అది చిన్నగా గర్జించినా పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది దానికి భయపడకుండా ఎదురు తిరగటం సాధ్యమా?.. సాధారణ ప్రజలకైతే అసాధారణమే కానీ, ఆ వ్యక్తికి కాదు. సింహం ఎదురు పడితే ఆ వ్యక్తి భయపడలేదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధమే అన్నట్లు.. కర్రతో దాని పని పట్టాడు. కర్రతో దాన్ని దూరంగా పరిగెత్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అనిమల్ పవర్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 7.9 లక్షల వ్యూస్ 50వేలకు పైగా లైక్స్ సంపాదించుకుంది. అయితే, ఆ మనిషి ఎవరు? ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? అన్న విషయాలు తెలియరాలేదు.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ వీడు మగాడ్రా బుజ్జి.. కర్రతో సింహాన్ని పరుగులుపెట్టించాడు!’’.. ‘‘ అది సింహం అయితే, అతడు ఆ సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్’’.. ‘‘నువ్వు నిజంగా చాలా గ్రేట్ మ్యాన్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఆ సింహానికి అతడికి పరిచయం ఉండి ఉంటుందని లేదా సింహాలకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అయింటాడని అంటున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bihar: చిలుక తప్పిపోయింది.. పట్టిస్తే ఊహించనంత నజరానా!