Viral Video: హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ద్వి చక్ర వాహనదారులకు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూటికి తొంభై శాతం ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలవ్వటం సహజం. ప్రమాదాల సందర్భంగా తలకు ఎలాంటి రక్షణ లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. అందుకే ట్రాఫిక్ అధికారులు హెల్మెట్ పెట్టుకోవాలని పదేపదే చెబుతుంటారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో.. నాణ్యమైన హెల్మెట్ పెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ తలను రక్షించేదిలా ఉండాలి. అలా జరక్కపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఐఎస్ఐ మార్కు హెల్మెట్ వాడటం ఉత్తమం. తాజాగా, నాణ్యమైన హెల్మెట్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి తల బస్ టైరు కింద పడినా.. నలిగినా చావునుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం బైకుపై బయటకు వెళ్లాడు. ఓ మలుపు దగ్గర అతడి బైకు అదుపు తప్పి నేరుగా బస్సుకిందకు వెళ్లింది. ఆ సమయంలో అతడు గట్టిగా బ్రేకులు వేయటంతో ఎగిరి నేరుగా బస్ టైరు కిందపడ్డాడు. తల వెళ్లి టైరు కింద ఇరుక్కుంది. ఓ మనిషి బస్ కింద పడ్డాడని గుర్తించిన డ్రైవర్ బస్‌ను ఆపాడు. అప్పటికే బస్ టైరు బైకుపై వచ్చిన వ్యక్తి తలను నలిపింది. అదృష్టవశాత్తు అతడి తలకు హెల్మెట్ ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. టైరు హెల్మెట్‌ను ఎక్కి ముందుకు వెళ్లలేకపోయింది. హెల్మెట్‌ను నలిపి ముక్కలు చేసింది. బస్ నిలబడగానే ఆ వ్యక్తి టైరు కింద నుంచి పక్కకు వచ్చాడు. మరికొంత మంది అతడికి సహాయం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి, ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ" Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u — Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022 ఇవి కూడా చదవండి : ఈమె అందం చుట్టూ ఊహించని రచ్చ! ఆ వీడియోస్ బయటకి!