Viral Leave Letter: ఆఫీసు కావచ్చు.. ఇంకేదైనా ఉద్యోగం కావచ్చు.. పని పడ్డపుడు.. లేక ఆరోగ్యం బాగోలేనపుడు సాధారణంగా సెలవులు పెట్టడం పరిపాటి. కానీ, కొంతమంది ఇందుకు భిన్నంగా సిల్లీ కారణాలతో సెలవులు అడిగి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఓ కానిస్టేబుల్ తన భార్య తమ్ముడి పెళ్లికి 5 రోజులు సెలవులు కావాలని కోరాడు. ఆ పెళ్లికి రాకపోతే తన భార్య హింసిస్తుందని సెలవు చీటిలో రాసి ఉన్నతాధికారులకు ఇచ్చాడు. కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్ ఓ అడుగు ముందుకు వేసి.. ‘‘ నాకు ఇటీవల పెళ్లైంది. కొన్ని ప్రత్యేక పూజలు చేయించాలి. ఊరిలో కొన్ని పనులున్నాయి. కొత్తగా పెళ్లికావడంతో ఆగలేకపోతున్నాను. మూడ్లో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకుని 10 రోజులు సెలవు మంజూరు చేయండి’’ అని సీఐకి లేఖ రాశాడు.
తాజాగా, మరో కానిస్టేబుల్ సెలవు కోసం ఓ వెరైటీ కారణాన్ని చెప్పుకొచ్చాడు. కర్ణాటకలోని యశవంతపురకు చెందిన సీసీబీ కానిస్టేబుల్ ఆనంద తన భార్యతో కలిసి సినిమా చూడలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సీఐకి ఓ లేఖ రాశాడు. తనకు భార్యతో కలిసి సినిమా చూడాలని ఉందని, సెలవు మంజూరు చేయమని కోరాడు. సీఐ ఏమీ అనకుండా సెలవు మంజూరు చేశాడు. దీంతో ఆనంద సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. తర్వాత ఈ లేఖను సోషల్ మీడియాలో ఉంచాడు. ఆ లేక కాస్తా వైరల్గా మారింది. మరి, ఈ వైరల్ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 120 స్పీడులో ట్రక్.. చక్రాల పక్కనే చంటి బిడ్డ..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.