“బుల్లెట్ బండి ఎక్కీ వచేత్తపా ” అనే పాటకు ఓ పెళ్లికూతురు డ్యాన్స్ చేసి.. ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ యువతితో పాటు ఆ పాట కూడా మంచి ఫేమస్ అయింది. ఎంతలా అంటే ప్రతి వధవు.. తన పెళ్లిలో ఈ పాటకు చిందులేస్తుంది. పెళ్లి బరాత్ లో చాలా మంది పెళ్లి కూతుర్లు.. వరుడి ముందు ఈ పాటతో డ్యాన్స్ చేసి అందరిని ఫిదా చేస్తుంటారు. పాతకాలంలో లంగం అయితుంది అంటే వంట వచ్చా? సంగీతం వచ్చా? మిషన్ కుట్టుడు వచ్చా? అని పెద్దలు అడుగుతుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకు కోసం చేసే డ్యాన్స్ వచ్చా అనే కాలం వచ్చింది. ఈ బుల్లెట్టు సాంగ్ ఫీవర్ అమ్మాయిలను ఎప్పటికి వదలవేమో.. ఎక్కడా చూడా అదే సాంగ్ వినిపిస్తుంది. ఒకానోక సమయలంలో పెళ్లి బరాత్ అంటే ఈ సాంగే అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగింది. అదే విధంగా తాజాగా అలాంటి ఇంకో పాటకు ధూమ ధామ్ గా డ్యాన్స్ చేసింది ఓ పెళ్లి కూతురు. తన అదిరిపోయే డ్యాన్స్ తో పెళ్లి కొడుకును ఫిదా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్ రెడ్డి!