ప్రజాప్రతినిది కాదు.. ఊరి పెద్ద అంతకన్నా కాదు. కానీ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలందరికీ తెలుసు, కారణం- అతడి భారీ కాయం. అవును.. బిహార్ లోని కటిహార్ జిల్లా జయనగర్ కు చెందిన రఫీక్ అద్నాన్ బరువు 200 కిలోలకుపైనే. పెళ్లై ఇద్దరు భార్యలున్నా.. పిల్లలు కూడా కలగలేదు. ఈ భారీ ఊబకాయంతోటి కొద్ది దూరం కూడా నడవలేడు. ఎటు వెళ్లాలన్నా బుల్లెట్టే దిక్కు. ఇంకా.. అతడి ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. రఫీక్ ప్రతిరోజు నాలుగు కేజీల పిండితో చేసిన రోటీలు, 3 కిలోల రైస్, రెండు కిలోల చికెన్, కిలోన్నర చేపలు, 3 లీటర్ల చొప్పున పాలు లాగించేస్తాడు. ఇలా మొత్తం రోజులో సుమారు 14-15 కేజీల ఆహారం భుజిస్తాడు. అంతే మొత్తంలో మంచినీరు తాగాల్సిందే. రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెడుతుంటారు. స్థూలకాయం వల్ల అతణ్ని వివాహాల వంటి వేడుకలకు స్థానికులెవరూ ఆహ్వానించడం లేదు. విందుకు వస్తే భారీగా భోజనం తినేస్తాడన్న ఆందోళనే అందుకు కారణం. తన బరువును సాధారణ బైక్‌లు మొయ్యలేవు కనుక బుల్లెట్ బండిని కొనుక్కోగా.. అప్పుడప్పుడు అది కూడా మొరాయిస్తుండటంతో నిట్టూరుస్తున్నారు. రఫీక్ కు ధాన్యం వ్యాపారం ఉంది. వ్యవసాయం కూడా చేస్తాడు. ఆర్ధిక ఇబ్బందులేవీ లేవు. "చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేవాడిని. కానీ ఇప్పుడు భారీగా బరువు పెరిగాను. అధిక బరువు కారణంగా బుల్లెట్‌పై వెళ్లటం కూడా ఇబ్బందిగానే ఉంటోంది. ఇప్పుడు 200 కేజీలు ఉన్నాను. నాకు పెళ్లయింది కానీ పిల్లలు లేరు. అధిక బరువే అందుకు కారణం. ఈ బరువు కారణంగా నడవలేకపోతున్నా. రోటీ, అన్నం, మాంసం తింటాను" అని రఫీక్ చెప్పుకొచ్చాడు. రఫీక్ అద్నాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు బులిమియా నెర్వోసా.. పరిమితులు లేకుండా ఆహారం తీసుకోవడం అనేది ఈ వ్యాధి లక్షణం. ఈ విషయం గురుంచి అతడికి చికిత్స అందించే డాక్టర్ మృణాల్ రంజన్ మాట్లాడుతూ.. రఫీక్‌కు బులిమియా నెర్వోసా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తింటుంటారు. ఈ వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. చాలా నెమ్మదిగా అతను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించుకుంటూ రావాలని చెప్పారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!