ఇంట్లో ఓ మనిషి మృతి చెందాడంటే.. ఆ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి ఉంటారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదార్చుతారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలను తలుచుకునేందుకు.. ఆ బాధ నుంచి బయపడేందుకు సంతాప సభ నిర్వహిస్తారు. వచ్చిన వారు కూడా.. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతారు. ఎక్కడైనా ఇదే తంతు జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చదవోబోయే వార్త ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన తర్వాత సంతాప సభలో బెల్లి డ్యాన్స్‌లు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే వివరాలు లేవు. కానీ వీడియోని బట్టి చూస్తే.. అక్కడ ఓ వ్యక్తి సంతాప సభ జరుగుతుంది. చాలా మంది బంధువులు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం నిర్వహించిన తీరు చూస్తే.. ఎవరో ధనవంతుల ఇంట ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఇక వచ్చిన అతిథులకు సపర్యలు చేస్తున్నారు కొందరు. ఈ నివాళి సభకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు విచ్చేశారు. ఇంతలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యేలా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పోకిరీ(హిందీ రీమేక్) సినిమాలోని ఐటెమ్ సాంగ్‌ను ప్లే చేశారు.
ఇది కూడా చదండి: Karnataka: దారుణం.. మహిళా న్యాయవాదిని కడుపులో తన్నుతూ దాడి.. వీడియో వైరల్
ఇంతవరకు బాగానే.. పాట ప్లే అయిన వెంటనే కొందరు యువతులు స్టేజ్ మీదకు వచ్చి బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో సభలో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. సంతాప సభలో ఇదేం పని రా నాయనా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోరిక మేరకు ఇలా వైరటీగా ప్లాన్ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. మీకిందే పోయేకాలం అని ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bride, Groom: వరుడి మెడలో తాళి కట్టిన వధువు.. గ్రామస్తులు ఏం చెబుతున్నారో తెలుసా?