సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు బాగా వినిపిస్తున్న పాట కృతీసనన్ నటించిన ‘మీమీ’ చిత్రంలోని ‘హయ్ మేరి పరం పరం పరమ సుందరి’. ఈ పాటకు చిన్న పిల్లల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వారివారి స్టైల్‌లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. అదే పాటకు కాలు కదిపింది మన బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ.
ఆ పాటకు స్పెప్పులేయడమే కాదు.. అందాలను ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఊదా రంగు గౌనులో విష్ణుప్రియ అచ్చు పరం సుదరిలాగే డాన్సు చేసింది. ఇదంతా ఏదో ఫొటోషూట్ కోసం తీసిన సాంగ్‌లా అనిపించింది. ఆ వీడియోని జన్మాస్టమి వైబ్స్ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంకే ముంది కుర్రకారు లైకులు, షేర్లతో ఇన్‌స్టాని షేక్ చేస్తున్నారు. మరి, ఆ అందాల భామ వీడియోని మీరు చూసేయండి.