ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు షేర్ చేసే పారిశ్రమిత వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. ఆయన తరచూ ప్రేరణాత్మకు వీడియోలను షేర్ చేస్తుంటారు. మహీంద్ర షేర్ చేసే వీడియోలు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి.. తాజాగా ఓ ఏనుగు పుట్టిన రోజుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏనుగు తలాండిచే విధానం బాగుందంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్ర వీడియో పోస్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు." ఈ క్లిప్ తమిళనాడులోని తిరువానవైకవల్ ఆలయానికి సంబంధించిన అఖిల అనే ఏనుగు పుట్టిన రోజు వేడుకది. ఏనుగు దేశీ రూపంలో, తలాడించే విధానం నాకు ఎంతో నచ్చింది. అది తన సంతోషించే తీరు ఇతరులను ఆకట్టుకునేలా ఉంది. తమను తాము సంతోష పరుచుకోవాలని భావించే వారికి ఇదో మంచి వీడియో" అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఏనుగు తనకు ప్రసాదంగా పెట్టిన వివిధ రకాల పండ్లు తింటూ సంతోషంగా తలాడించడం అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అఖిల అనే ఏనుగుకు పుట్టిన రోజుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల మంది వీక్షించారు. మరి.. ఈవీడియోపై మీ అభిప్రాయలను కామెంట్స రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: 7 ఏళ్ళ బాలిక సాహసం! 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు..! I’m told this clip is from the Thiruvaanaikaval temple (Tamil Nadu) Akhila the elephant’s birthday celebration. I love her typical desi, sideways shake of the head. And her happiness is infectious… A good clip to watch if you ever need cheering up… pic.twitter.com/0UWVzXLhWr — anand mahindra (@anandmahindra) June 10, 2022