మన దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ లో కమల హాసన్ ని చూశాం, సావిత్రిని చూశాం. ఇలా చాల మందినే చూసే ఉంటాం. విళ్ల యాక్టింగ్ చుస్తే కన్నీళ్లొస్తాయేమో కానీ…ఓ మహిళ చేసిన యాక్టింగ్ కు మాత్రం అందరు కడుపుబ్బా నవ్వలేక చస్తున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియవు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక విషయం ఏంటంటే…గ్రామంలోని ఓ దేవాలయం దగ్గర కొందరు వ్యక్తులు పోటాపోటీగా కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలా ఒకరినొకరు నెట్టుకుంటూ, గొడవ పడుతూ ఉంటారు. అందులో ఓ పెద్ద మనిషి ఓ మహిళను కాస్త వెనక్కి గట్టిగ నెడతాడు. దీంతో ఆ మహిళ పక్క నున్న గ్రానెట్ చిన్న రాళ్ల కుప్పపై పడుతుంది. ఇక కింద పడ్డ మనిషి అంతలా దెబ్బ తగిలితే ఏడుస్తునైనా ఉండాలి లేక మళ్లీ గొడవకైన దిగాలి. కానీ అలా చేయకుండా ఏం చేసిందో తెలుసా?…ఇక ఇక్కడే మన అక్క నట విశ్వరూపం బయటపడింది.
కింద పడ్డ మహిళ అటు ఇటు కదలకుండా చనిపోయినట్టు యాక్టింగ్ చేసి ఆస్కార్ అవార్డు వరకు వెళ్లేంత పని చేసింది. ఇక పక్కనున్న వాళ్ళంతా నిజంగా ఏం జరిగిందని ఒక్కసారిగా షాక్ గురయ్యేలా చూశారు . ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఈ అక్క యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు కూడా తక్కువే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ వీడియోపై మీరు ఓ సారి లుక్కేయండి మరి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.