నిత్యం మనకు వినిపించే వార్తల్లో ఏవి నిజాలో.. ఏవి అబద్ధాలో.. ఏవి భ్రమో తెలియనంతగా సోషల్ మీడియా మనల్ని మాయ చేస్తోంది. ఏదైనా ఒక సెన్సేషన్ విషయం సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు.. క్షణాల వ్యవధిలో వైరలవుతోంది. అది నిజమా.. కాదా అన్నది తర్వాత. ముందు మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలుస్తోంది.తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో ఒక భారీ అనకొండకు సంబంధించినది. చూడగానే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్న ఈ అనకొండ గురించి వాస్తవం తెలిస్తే.. షాక్ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. తన అద్భుతమైన తెలివితేటలతో.. చూసేవారిని మాయ చేశాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోలో ఒక వ్యక్తి తొలుత మంచును చెక్కుతూ పోతాడు. అలా చివరకు చివరకు అది భారీ అనకొండగా రూపుదిద్దుకుంది. దీన్ని సడన్ గా చూస్తూ.. అమ్మో ఎంత పెద్ద అనకొండో అనిపించక మానదు. కానీ అది ఒక బొమ్మ..దాన్ని చూస్తే నిజంగా అనకొండ అనుకుంటారు. అంత అద్భుతంగా చెక్కాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అనకొండను అద్భుతంగా చెక్కిన వ్యక్తి పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి టాలెంట్ చూసి పలువురు ఈ ఆర్ట్‌వర్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఉండటానికి అర్హత ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీడియో పై మీరు ఓ లుక్కెయండి .