సమాజంలో వెలకట్టలేనిది విద్య. విద్యను భోదించే గురువులు దైవంతో సమానంగా చూస్తాము. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారి అభ్యున్నతికి పాటుపడతారు. సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు టీచర్స్ కృషి చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంత మంది ఉపాద్యాయులు చేసే తప్పిదాల వల్ల వారు చెడ్డ పేరును మూటగట్టుకుంటున్నారు.
సమాజంలో వెలకట్టలేనిది విద్య. విద్యను భోదించే గురువులు దైవంతో సమానంగా చూస్తాము. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారి అభ్యున్నతికి పాటుపడతారు. సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు టీచర్స్ కృషి చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంత మంది ఉపాద్యాయులు చేసే తప్పిదాల వల్ల వారు చెడ్డ పేరును మూటగట్టుకుంటున్నారు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి భావి భారతపౌరులుగా తయారు చేయాల్సిన ఉపాద్యాయులు విచక్షణ కోల్పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయుల పట్ల విలువలు తగ్గిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఓ పాఠశాలలో ఇద్దరు టీచర్లు విద్యార్థులు చూస్తున్నారనే సోయి లేకుండా గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటు తన్నుకున్నారు. ఆ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అసలు ఆ టీచరమ్మలు ఎందుకు కొట్టుకున్నరు? వారి గొడవకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్ రాజధాని నగరమైన పాట్నాలో బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీలోని స్కూల్లో కాంతి కుమారి ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా వ్యక్తిగత కారణాల నడుమ వివాదం కొనసాగుతుంది. అయితే గురువారం రోజు తరగతిగదిలో గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిని ఒకరు ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న చేను వద్దకు చేరారు. అక్కడే కిందపడి జట్టుపీక్కుంటూ, చెప్పుతో కొడుతూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ విషయానికి సంబంధించి బిహ్తా బ్లాక్ ఎడ్యకేషన్ అధికారి మాట్లాడుతూ.. ఆ టీచరమ్మల వివాదం గురించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని, వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
बिहटा के सरकारी स्कूल का नजारा… जब खेत बना अखाड़ा! राजधानी पटना से सटा है बिहटा… आपसी विवाद में स्कूल की प्रभारी प्रधानाध्यापक और एक शिक्षिका भिड़ गई. एक-दूसरे के बाल खींचे. खेत में पटका-पटकी तक हो गई… मौके पर मौजूद ग्रामीण वीडियो बनाते रहे जो अब वायरल हो रहा है. pic.twitter.com/wZ1pzhIvE1
— Prakash Kumar (@kumarprakash4u) May 25, 2023