ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు తలపడే సంఘటనలు సినిమాల్లో చాలానే చూశాం. కానీ.., ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయి కోసం తలపడే రోజులు వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వీరిద్దరికి లేట్‌గా తెలిసింది. ఆ అమర ప్రేమికుడిని వదులుకోవడానికి ఇద్దరిలో ఎవరు ఇష్టపడలేదు. వాడు నా వాడు అంటే.. నా వాడు అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. నువ్వు మర్చిపోవాలంటే.. నువ్వే మర్చిపో అంటూ ఘర్షణకు దిగారు. అది కాస్తా శృతి మించడంతో ఇలా రోడ్డు మీదే బాహాబాహీకి దిగారు.
ఆ సమయంలో ఆ అమర ప్రేమికుడు ఆ చుట్టు పక్కల ఉన్నాడో.. లేదో తెలియదు గాని.. మిగతా విద్యార్థులకి మాత్రం వీరి వాదన మంచి టైం పాస్ అయ్యింది. అక్కడున్న తోటి విద్యార్ధులు ఈ ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. మరి.. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.