‘స్క్విడ్ గేమ్’ ఈ వెబ్ సిరీస్ ఒక సంచలనమనే చెప్పాలి. ఏ ఇద్దరు కలిసినా ఆ వెబ్ సిరీస్ గురించే టాక్. హాంగ్ డోంగ్ హ్యూక్ రచించి.. డైరెక్ట్ చేసిన సౌత్ కొరియన్ సర్వైవల్ డ్రామా అది. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ అంటే ఆ గేమ్ ను అచ్చు అలాగే ఒక అమెరికన్ యూట్యూబ్ ఛానల్ MR.బీస్ట్ వాళ్లు నిర్వహించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్..
వెబ్ సిరీస్ లో ఆడిన ప్రతి ఆటను రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ లో ఆడించారు. ప్రైజ్ మనీ అంతా ఇంతా కాదు 4,56,000 వేల యూఎస్ డాలర్లు(అంటే రూ.3 కోట్లకుపైనే) మొదట రెడ్ లైట్, గ్రీన్ లైట్ తో మొదలైన ఆట చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది. రీల్ గేమ్ లో అయితే రెడ్ లైట్ వచ్చాక కదిలిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తారు. రియల్ గేమ్ లో కూడా కాలుస్తారు. వారికి అమర్చిన ఒక సెన్సార్ తో లిక్విడ్ ప్యాకెట్ పేలుతుంది అంటే వారు ఎలిమినేట్ అయినట్లు అనమాట. అలా సాగే ఈ గేమ్ లో చివరకు ఇద్దరే మిగులుతారు.
అన్ని అవే గేమ్స్..
రెడ్ లైట్- గ్రీన్ లైట్ మొదలైన గేమ్స్ సిరీస్ లో లానే క్యాండీని షేప్ లో కట్ చేయడం. టగ్ ఆఫ్ వార్ లో ఒక ఎంటైర్ టీమ్ ను ఎలిమినేట్ చేయడం. గ్లాస్ రన్నింగ్, మ్యూజిక్ చైర్స్ తో ముగుస్తుంది. ఆ సమయానికి కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారు. జెర్సీ నంబరు 079 విన్నర్ గా నిలుస్తాడు. 330 రన్నరప్ గా మిగులుతాడు. రన్నరప్ అయిన 330కి 10 వేల డాలర్లు ప్రైజ్ మనీ కింది ఇచ్చారు. విన్నర్ గా మారిన 079కు ప్రైజ్ మనీ 4,56,000 డాలర్లు ఇచ్చారు. ఈ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. వెబ్ సిరీస్ కు ఏమాత్రం తీసిపోకుండా. అప్ లోడ్ చేసిన కేవలం 36 గంటల్లోనే 71 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. రియల్ లైఫ్ లోనూ స్క్విడ్ గేమ్ ఉంది అని అప్పట్లో గట్టిగానే వాదించారు. రైటర్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను బట్టే అలా రాశాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ సెన్సేషన్ అయ్యింది. రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.