మనం రోజూ నెట్టింట్లో అనేక వీడియోలు చూస్తుంటాము. అందులో కొన్ని మనల్ని ఆకట్టుకుంటాయి. మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వీక్షిస్తుంటాము. అయితే తాజాగా ఓ ఆరెంజ్ పండు వీడియో తెగ వైరల్ అవుతోంది. అది మిగతా ఆరెంజ్ పండ్లకు భిన్నంగా ఉండి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారు దాన్ని ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంటూ కామెంట్స్ చేశారు.
వీడియోలో చూస్తే.. ఆరెంజ్ పండుతో ఓ వ్యక్తి కనిపించాడు. ఈ నారింజను తినేందుకు తొక్క ఒలిచాడు. అంతే అందులో మరికొన్ని చిన్న సైజ్ లో నారింజ పండ్లు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ లోపలి ఆరెంజ్ పండ్లు కూడా చాలా సహజంగా ఉన్నాయి. దీనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. ఈ వీడియో నెటిజన్లను షాకయ్యేలా చేయడంతో.. కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ ఆరెంజ్ ప్రెగ్నెంట్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మీరు ఈ వీడియో పై లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.