పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని ఊరికే అన్నారా పెద్దలు. అవునండి ఎప్పుడూ ఒకేలా తింటే కిక్క్ ఏముంటుంది. అందుకే, ఫుడ్ కంపెనీలు కూడా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాయి. అలా చేసే క్రమంలో కొన్ని హిట్టయితే, కొన్ని ఫ్లాపవచ్చు. అలా ఆస్ట్రేలియాలో ప్రముఖ పిజ్జా కంపెనీ డొమినోస్ సంస్థ ఓ ప్రయోగం చేసింది. మరి నెటిజన్ల ఏమన్నారో చూసేయండి.
అన్ని ప్రయోగాలు హిట్ అవ్వాలని లేదు. ఈ మధ్య పిజ్జాపై పైనాపిల్ వేస్తే బాగానే పాపులర్ అయ్యింది. అదే పసుపుతో అమూల్ ఐస్క్రీమ్ చేస్తే వామ్మో అన్నారు. కూల్డ్రింక్తో ఆమ్లెట్ అంటే అయ్యబాబోయ్ అన్నారు. అలాగే, డొమినోస్ ఆస్ట్రేలియా యూనిట్ కొత్తగా పిజ్జా క్రస్ట్కు బదులుగా పుచ్చకాయతో పిజ్జా చేసింది. పుచ్చకాయను రౌండ్గా క్రస్ట్లాగా కట్ చేసి దానిపై సాధారణ పిజ్జాలాగే సాస్, చీజ్ అన్నీ వేసి ఓవెన్లో పెట్టారు. ఓవెన్లో నుంచి బయటకు తీయగానే దాని లుక్ అచ్చు పిజ్జాలాగానే అని పించింది. ఆ వీడియోను వారి ఇస్టా పేజ్లో పోస్ట్ చేశారు.
ఇక, నెటిజన్లు వారి స్టైల్లో కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. కొందరు చాలా బాగుందని కితాబివ్వగా.. మరికొందరు ఇది చట్టవిరుద్ధమంటూ మాట్లాడారు. పిజ్జాపై పైనాపిల్ వేసినప్పుడు పుచ్చకాయతో పిజ్జా తప్పేంటంటూ కొందరు మద్దతిచ్చారు. మరి ఆ వైరల్ వీడియోని మీరు చూసేయండి.