‘అనువుగాని చోట అధికులమనరాదు’ ఈ చిన్న లైనులో చాలా పెద్ద అర్థముంది. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలా సందర్భాల్లో గొడవలు, దాడులు తగ్గుతాయి. కొన్నిసార్లు తప్పు ఎదుటివాడిదే అయినా.. ఆచితూచి వ్యవహరించాలి. అలా చేస్తే ఎంతో పెద్ద ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఆ విషయాన్ని గ్రహించని తల్లీ, కూతుళ్లు కాస్త శ్రుతి మించి వ్యవహరించారు. తప్పు వారిది కాకపోయినా చివరికి తన్నులు తిన్నారు.
విషయం ఏంటంటే.. లక్నోలో ఓ దుకాణం దగ్గరకి కర్ర తీసుకుని తల్లీ, కుమార్తె వచ్చారు. ఆ దుకాణంలోంచి ఓ కుర్రాడిని బయటకి పిలిచి ఏం పని నువ్వు చేసింది అని ఆగ్రహంతో ప్రశ్నించింది. నా కుమార్తెకు అసభ్యకర కామెంట్లు పెడతావా అంటూ గట్టిగా అడిగింది. అక్కడున్న వారందరికీ కూడా వారి ఫోన్‌లో ఉన్న కామెంట్‌ను చూపించింది. ఆ యువకుడు ఎవరో కాదు ఆమె తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించిన తన అన్న కుమారుడేనంట. ఆ విషయం కూడా ఆమె అందరికీ చెప్పింది. మరి, మేనల్లుడు అలా చేసే సరికి కోపంతో ఊగిపోయింది.
ఇలాంటి పనులు చేస్తావా అని నలుగురిలో పట్టుకుని వారించింది. ఆ యువకుడు ఇక్కడేంటి గొడవ వెళ్లిపోండంటూ కేకలు వేశాడు. ఆగ్రహం తట్టుకోలేని మహిళ అతడిని కర్రతో కొడుతుంది. అతను చేయి చేసుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఇంకా శ్రుతిమించి మహిళ కుమార్తె కూడా కర్ర తీసుకుని గట్టిగానే ఆ కుర్రాడానికి కొడుతుంది. ఇంక సహనం కోల్పోయిన యువకుడు ఆ యువతిని జుట్టు పట్టుకుని కొట్టడం ప్రారంభించాడు. అడ్డుకోబోయిన తల్లిని పక్కనున్న మరో వ్యక్తి కిందపడేసి జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు. అక్కడ చాలా మంది ఉన్నా ఎవరూ అడ్డుకోవడానికి రాలేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ये लखनऊ तो नहीं हो सकता…? 🤔🤔
🤭 दीदी ओ दीदी… #कानपुर ….#lucknowgirl #Lucknowcabdriver pic.twitter.com/dSIj0A13W6— 𝗗ʀ.𝗔sʜɪsʜ 💉 (@_iAmDrAshish) August 26, 2021