ఇప్పటిదాకా జంతువులు మూడు కాళ్లతో పుట్టడం, రెండు తలలతో జన్మించడం వంటి వార్తల్ని మనం విన్నాం చూశాం. కానీ తాజాగా ఓ ఆడశిశువు తోకతో జన్మించింది. ఈ అరుదైన ఘటన మెక్సికోలో వెలుగు చూసింది. 5.7 సెం.మీ పొడవైన తోకతో ఓ ఆడ శిశువు జన్మించింది. ఈ ఘటన చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు రెండు నెలల పాటు ఆ చిన్నారిని పర్యవేక్షించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి చిన్నారి తోకను తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని న్యూవో లియోన్ రాష్ట్రంలో ముప్పై ఏళ్ల వయసున్న దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇప్పటికే ఓ బాబు ఉండగా, మహిళ రెండోసారి గర్భం దలిచింది.
ఆమెకు గర్భం దాల్చిన సమయం నుంచి అంతా సాధారణంగానే ఉందని ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. అయితే ప్రసవం జరిగాక తోకతో జన్మించిన శిశువును చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. తోక చివర వెంట్రుకలతో కప్పబడి, కొద్దిగా ఎడమ వైపునకు వంగి ఉన్నట్లు తెలిపారు. 5.7 సెంటి మీటర్ల పొడవు, 3 మి.మీ. – 5 మి.మీ. వ్యాసం ఉన్నట్లు వెల్లడించారు. తోక కదిలించినప్పుడు చిన్నారి ఎలాంటి భావజాలాలు ప్రదర్శణించలేదట. అంటే.. నొప్పి కలగడం వంటివి. అనంతరం రెండు నెలల పాటు చిన్నారిని వైద్యులు పర్యవేక్షించారు. ఈ సమయంలో శిశువు సాధారణ పిల్లల్లా పెరుగుతున్నదని గుర్తించారు. బరువు కూడా సాధారణంగానే ఉన్నదని, గుండెలో ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. అనంతరం బాలికకు లింబర్గ్ ప్లాస్టీ సర్జరీ చేసి శరీరం నుంచి తోకను తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యాంగా ఉన్నట్లు వెల్లడించారు.
Baby Girl Born With ‘True Tail’ Gets It Surgically Removed In Mexico https://t.co/Lv1pm557ek #trending #viral
— Indiatimes (@indiatimes) November 30, 2022
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 195 మంది నిజమైన తోకతో జన్మించారు. వీటిలో అతి పెద్ద తోక పొడవు 20 సెంటీ మీటర్లు. ఈ అసాధారణ ఘటనలు అబ్బాయిల్లోనే ఎక్కువ జరిగాయి. ఇలా జన్మించిన ప్రతి 17 మందిలో ఒకరు మెదడు, పుర్రె ఎదుగుదలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారట. ఇక గతేడాది బ్రెజిల్లో జన్మించిన 12 సెంటిమీటర్ల పొడవైన తోకతో జన్మించింది. ఆ చిన్నారి తోక చివర్లో బంతి వంటి నిర్మాణం కూడా ఉంది.