నిత్య జీవితంలో అందరూ పనులతో బిజీగా ఉంటారు. ఆ వర్క్ నుంచి రిలీఫ్ కోసం టీ, కాఫీలు తాగుతుంటారు. టీ, కాఫీల్లో మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేవి చాలానే ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి సాధారణంగా కిలో టీ పొడి ధర వందల నుంచి వేలల్లో ఉంటుంది. కానీ ఇటీవల వేలంలో ఓ రకం టీ పొడి కిలో ధర చూసి అందరూ అవాక్కయ్యారు. వంద, వేలు కాదు.. ఒక కిలో టీ పొడి ధర ఏకంగా లక్ష పలికింది. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడిగా రికార్డుకెక్కింది. దాని సంగతులు ఏంటో, ఆ టీ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Manohari Gold Tea, a rare variety of tea in Assam sold for Rs 1 lakh per kilogram on Tuesday at Guwahati Tea Auction Centre: Bidyananda Barkakoty, Adviser, North Eastern Tea Association (NETA) pic.twitter.com/XZ6SuddVd0
— ANI (@ANI) December 14, 2021
‘మనోహరి గోల్డ్ టీ’ అనేది టీ ఉత్పత్తుల్లో మంచి పేరున్న టీ పొడి కంపెనీ. తాజాగా మనోహరి గోల్డ్ టీ చరిత్ర సృష్టించింది. మనోహరి గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ అత్యధికంగా కిలోకు రూ. 99,999 ధరకు కొనుగోలు చేసింది. ఈ టీని ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. బహిరంగ వేలంలో టీ కి చెల్లించిన అత్యధిక ధర ఇదేనని మనోహరి గోల్డ్ టీ కంపెనీ వారు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు, రోసెల్ టీ ఇండస్ట్రీస్ కు చెందిన డికోమ్ టీ ఎస్టేట్లోని గోల్డెన్ బటర్ ఫ్లై టీ అని పిలువబడే అరుదైన రకం అస్సాం టీ గౌహతి టీ వేలం కేంద్రం (GATC)లో కిలోకు రూ.75,000 పలికింది.
1kg of specialised Assam tea sells for ₹99,999 at Guwahati auction. Saurabh Tea Traders won the bid for specialised tea branded as Manohari Gold and produced by Manohari Tea Estate in Dibrugarh. There’s a very high demand for Manohari Gold tea and become popular worldwide. pic.twitter.com/s3avF5Yg9G
— Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) December 14, 2021
ఈ టీ పొడి ఆర్యోగ పరంగా చాలా ప్రత్యేకమైందని, అందుకే రికార్డు స్థాయిలో ధర పలికినట్లు ఆ కంపెనీ వారు తెలిపారు. ఈ టీ పొడిని కాచినపుడు డికాషన్ ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుందని, ఈ డికాషిన్ సేవిస్తే మనసు తేలికపడిన భావన కలుగుతుందని, పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని మనోహరి గోల్డ్ కంపెనీకి చెందిన రాజన్ లోహియా చెప్పారు. ఓ టీ పొడి కిలో ధర దాదాపు లక్ష రుపాయాలు పలకటం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Manohari Gold Tea, a rare variety of tea in Assam sold for Rs 1 lakh per kilogram on Tuesday at Guwahati Tea Auction Centre: Bidyananda Barkakoty, Adviser, North Eastern Tea Association (NETA) pic.twitter.com/XZ6SuddVd0
— ANI (@ANI) December 14, 2021