ప్రపంచం మొత్తం కరోనా విజృంభణతో అతలాకుతలమవుతోంది. కరోనాను ఎలా కట్టడి చేయాలని తల పట్టుకుంటోంది. పాక్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. పాక్ లో హిందువులు మైనారిటీలు అన్న విషయం తెలిసిందే. మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ లో మరో హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Atrocities on minorities continue in Pakistan. Again a Local #Hindu Temple #Demolished in Village Thakor #Hyderabad, #Sindh #Pakistan
On demanding right to worship, shots were fired at them injuring many #Hindus including 3 women. pic.twitter.com/579v3GxwHW
— 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 (@Bhabanisankar02) January 12, 2022
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాక్ లో ఉన్న హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని ఠాకోర్ ప్రాంతంలోని హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశారు. దుండగుల దాడిలో ఎంతో మందికి గాయాలయ్యాయి. ముగ్గురు మహిళలు కూడా గాయాలపాలయ్యారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పని తాము చేసుకుంటున్నా కూడా తమపై దాడులు చేస్తూనే ఉన్నారని అక్కడి వారు వాపోతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Atrocities on minorities continue in Pakistan. Again a Local Hindu Temple Demolished in Village Thakor Hyderabad, Sindh.
On demanding right to worship, shots were fired at them injuring many Hindus including 3 women pic.twitter.com/DUaDkDsxuf
— MeghUpdates🚨™ (@MeghBulletin) January 11, 2022