Viral Video: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు.. ఒక్కోరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనిషి మానసిక స్థితులు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. తద్వారా చేసే పనుల్లో వారి మానసిక స్థితి తేలతెల్లం అవుతుంది. మరి, మానసిక స్థితి బాగోలేదో లేక మతి బాగుండే ఈ పని చేస్తున్నాడో తెలియదు కానీ, ఓ యువకుడు మహిళల లోదుస్తుల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇళ్లల్లోకి చొరబడి మరీ వాటిని దొంగిలిస్తున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మధ్యప్రదేశ్, గ్వాలియర్‌కు చెందిన ఓ యువకుడు వెరైటీ దొంగ అవతారం ఎత్తాడు. రాత్రిళ్లు రోడ్ల వెంట తిరుగతూ.. దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే, అతడు దొంగతనం చేస్తున్నది బంగారమో.. వెండో కాదు.. మహిళల లోదుస్తులు. రాత్రిళ్లు రోడ్ల వెంట తిరుగుతున్న ఆ యువకుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నాడు. మహిళల లోదుస్తుల్ని దొంగిలిస్తున్నాడు. గౌస్‌పురలో దొంగతనం చేస్తుండగా అది కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ సీసీ టీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోదుస్తుల దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సదరు చెడ్డీల దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. దొంగ ఇంట్లోకి చొరబడి దండెల మీద ఆరేసిన లోదుస్తుల్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. దొంగ కూడా అదే ఏరియా వాడు అయ్యుంటాడని అభిప్రాయపడుతున్నారు. మరి, మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న ఈ దొంగపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MP: In Gwalior, women are troubled by this strange thief who enters the house and steals the undergarment, not the jewellery. Incident caught on CCTV. pic.twitter.com/adLyFFm200
— Prateek Gautam (@psgautam) September 6, 2022
ఇవి కూడా చదవండి : Love Story: అటెండర్‌తో ఎంబీబీఎస్ డాక్టర్ ప్రేమ.. ప్రపోజ్ చేసి మరీ పెళ్లి చేసుకుంది..