యువతీ, యువకుల మధ్య ప్రేమ పుట్టడం ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. పెళ్లికి ముందు వరకు ఇద్దరికీ ఎన్ని గొడవలు ఉన్నా.. పెళ్లి రోజు వాటి గురించి మాట్లాడరు. ఆ ఆలోచన కూడా ఎవ్వరకీ రాదు. పెళ్లి సజావుగా జరిగితే సరిపోతుంది అనుకుంటారు. అయితే, ఓ వరుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. పెళ్లి రోజున తనకు కాబోయే భార్య పరువు తీశాడు. ఆమెకు సంబంధించిన ఓ రహస్యాన్ని పెళ్లి వారందరి ముందూ చెప్పేశాడు. దీంతో వధువుతో పాటు అక్కడివారంతా షాక్ అయ్యారు. ఈ సంఘటన స్కాట్లాండ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్కు చెందిన ఐయాన్ అనే యువకుడు, కేటీ అనే యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి కూడా సిద్దమయ్యారు.
ఎంతగానో ఎదురు చూసిన పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజన వెడ్డింగ్ రోస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా ఐయాన్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఐయాన్ మాట్లాడుతూ.. ‘‘ మేమిద్దరం మొదటి సారి క్రికెట్ క్లబ్లో కలిశాం. తర్వాత మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. ఆ రాత్రి తర్వాత ముద్దు కూడా పెట్టుకున్నాం. తర్వాత నేను ఆమెతో సరిగా మాట్లాడలేకపోయాను. ఇందుకు సారీ కూడా చెప్పాను. ఆమె తన ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్లీ కలుద్దాం అంది. నేను ఆమె నెంబర్ తీసుకోలేదు.
ఆమెకోసం కూల్ డ్రింక్ తెద్దామని బయటకు వెళ్లాను. నేను కూల్ డ్రింక్ తీసుకుని మళ్లీ ఆమె దగ్గరకు వచ్చాను. అప్పుడు ఆమె మరో వ్యక్తిని ముద్దులాడుతూ ఉంది. దీంతో నా మనసు ముక్కలైంది. రెండు కూల్ డ్రింక్స్ అక్కడే పడేసి వెళ్లిపోయాను. నాకు ఇప్పటికీ భయంగానే ఉంది. ఆమెను ఒంటరిగా బార్లో వదిలేసి వెళ్లటం మంచిది కాదని అనిపిస్తుంటుంది. నేను నీతో మరింత నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నాను కేటీ ’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. ఐయాన్ చెప్పిన మాటలతో కేటీ అల్లాడిపోయింది. అక్కడి జనం కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తర్వాత తేరుకుని కేకలు వేయటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.