పెళ్లి అంటే లక్షల్లో ఖర్చు.. రోజలు తరబడి శ్రమ. కరెక్ట్ గా చెప్పాలంటే.. ఒక్కరోజు జరిగే కార్యక్రమం కోసం దాదాపు నెల రోజుల పాటు ఇంట్లో అందరు హైరానా పడాల్సిందే. ఎలాంటి గొడవలు లేకుండా.. అంతా సవ్యంగా జరిగి.. మూడు ముళ్లు పడితే చాలు అనుకుంటారు. ప్రస్తుత కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లతో పాటు ప్రేమ వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. లవ్ మ్యారేజ్ అంటే.. ఎక్కువగా గుడిలోనో లేదా, ఆర్య సమాజ్ లోనో మరీ యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటే పోలీస్ స్టేషన్లలో కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పెళ్లి తంతు వేరే లెవెల్. ఇక వీళ్ల తెలివికి నోబెల్ ప్రైజ్ కూడా తక్కువే అనిపిస్తుంది. ఆ వివరాలు..
ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీన్ని ఎక్కడ షూట్ చేశారనే దాని గురించి వివరాలు తెలియవు. వీడియో విషయానికి వస్తే..ఘో చోట పెళ్లి జరుగుతుంటుంది. ఈ వేడకకు ఓ అమ్మాయి, అబ్బాయి కూడా హాజరవుతారు. అమ్మాయి కుర్చీలో కూర్చొని ఉండగా.. ఆమె వెనకే ఓ అబ్బాయి నిల్చుని ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇక మంటపం మీద పెళ్లి కుమారుడు తాళి కట్టే సమయంలో ఇక్కడ ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
పెళ్లికి హాజరైన యువతి, యువకుడు కూడా వివాహం చేసుకుంటారు. వేదిక మీద వరుడు తాళి కట్టే సమయంలో.. ఇక్కడ అమ్మాయి వెనక నిల్చున్న యువకుడు మెల్లిగా తన జేబులోంచి మంగళసూత్రం తీసి.. తన ముందు కూర్చున్న యువతి మెడలో కడతాడు. ఇక్కడే ఓ సూపర్ ట్విస్ట్ ఉంది. తాళి కడుతున్న వేళ.. ఆ యువతి.. దాన్ని చేతులతో పట్టుకుంటుంది. మూడు ముళ్లు పడగానే.. వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారు.
ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఏమన్నా ప్లానింగా.. ఇలాంటి ఆలోచన రాక.. అనవసరంగా లక్షలు ఖర్చు చేశాను అని కొందరు కామెంట్ చేయగా.. ఈ ఐడియా తెలియక ఎన్ని దెబ్బలు తిన్నానో అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ వీడియో అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ జంట ప్లానింగ్ మాత్రం సూపర్. ఈ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.